“ఉస్తాద్ భగత్ సింగ్” నుండి మాములు అప్డేట్ రాలేదుగా.. !

-

టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు సంబంధించిన ఏదైనా న్యూస్ రావడమే తరువాయి వెంటనే సోషల్ మీడియా దద్దరిల్లిపోయేలా ఫ్యాన్స్ లైక్స్, షేర్స్ , కామెంట్స్ చేస్తారు. తాజాగా పవన్ కళ్యాణ్ కొత్త సినిమాకు సంబంధించిన న్యూస్ ఒకటి వచ్చింది. ఇప్పటికే హరీష్ శంకర్ మరియు పవన్ కళ్యాణ్ కంబోలో వచ్చిన గబ్బర్ సింగ్ ఎంతటి బ్లాక్ బస్టర్ హిట్ అందుకుందో చూశాము. అప్పటి నుండి వీరి కంబోలో మరో సినిమా ఎప్పుడు వస్తుందా అని ఫ్యాన్స్ మరియు సినీ వర్గాలు వెయిట్ చేసాయి. ఇన్నాళ్లకు ఆ కల తీరనుంది, వీరిద్దరి కాంబినేషన్ లో “ఉస్తాద్ భగత్ సింగ్” అనే టైటిల్ తో సినిమా రానుంది. ప్రస్తుతం కొన్ని రోజుల నుండి షూటింగ్ జరుపుకుంటోన్న ఈ చిత్రం నుండి ఒక అప్డేట్ వచ్చింది. ఈ సినిమా నుండి గ్లిమ్ప్స్ వీడియో ను రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

మరో రెండు రోజుల్లో హైద్రాబాద్ లోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్ లో ఈ వీడియోను రిలీజ్ చేయడానికి ప్లాన్ చేశారు. మరి ఈ వీడియో ఏ రేంజ్ లో ఉంటుందో తెలియాలంటే అప్పటి వరకు ఆగాల్సిందే.

Read more RELATED
Recommended to you

Latest news