ఐపీఎల్ 2023 : ముంబైకి మరో షాక్.. జోఫ్రా ఆర్చర్ అవుట్ !

-

ఐపీఎల్ లో ప్రస్తుతం అన్ని జట్ల సంగతి అలా ఉంచితే అత్యధిక సార్లు టోర్నీ గెలిచిన జట్టు ముంబై సంగతి దారుణంగా ఉందని చెప్పాలి. మ్యాచ్ విన్నర్ దూరమై నానా ఇబ్బందులు పడుతోంది. కెప్టెన్ గా ఉన్న హిట్ మ్యాన్ రోహిత్ శర్మ కూడా ఫామ్ లో లేకపోవడం , బుమ్రా గాయంతో దూరం కావడం వంటి సమస్యలతో బాగా వెనకబడి ఉన్న ముంబై.. ప్రస్తుతం మరో షాక్ తో పూర్తిగా కుదేలైంది. గత సీజన్ లలో ముంబై ని విజయపధంలో దూసుకుపోయేలా తన బౌలింగ్ తో సహకరించిన ఇంగ్లాండ్ స్పీడ్ బౌలర్ జోఫ్రా ఆర్చర్ ఇప్పుడు ఐపీఎల్ లో మిగిలిన ఉన్న మ్యాచ్ లకు దూరమయినట్లు అధికారిక సమాచారం. గత సీజన్ కు ముందు జరిగిన వేలంలో భారీ ధరకు కొనుగోలు చేసిన ఆర్చర్ ముంబై కు పెద్దగా ఉపయోగపడింది లేదు.

గాయంతో గత సీజన్ లో ఆడలేకపోయాడు. కనీసం ఈ సీజన్ లో అయినా ఆడుతాడా అనుకుంటే ప్రస్తుతం వికెట్లు తీయకపోగా భారీగా పరుగులు సమర్పించుకుంటూ ముంబైకి భారంగా మారాడు. ఇప్పుడు గాయం కారణంగా పూర్తిగా ఐపీఎల్ కు దూరమయ్యాడు.

Read more RELATED
Recommended to you

Latest news