జీ తెలుగు చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి & రాధకు నీవేరా ప్రాణం సీరియల్స్ చూడండి..

-

మీ అభిమాన తారలను కలిసే ఛాన్స్ కొట్టేయండి!

హైదరాబాద్, 09 మే: ప్రపంచ మాతృదినోత్సవం సందర్భంగా జీ తెలుగు ప్రేక్షకులు ఎంతగానో అభిమానించే తారలను కలుసుకునే అవకాశం అందిస్తోంది. దీనికోసం మీరు చేయాల్సిందల్లా మీ అభిమాన సీరియల్స్ – చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి మరియు రాధకు నీవేరా ప్రాణం చూడటమే! ఈవారం అదిరిపోయే ట్విస్ట్లు, అలరించే మలపులతో ప్రసారం కానున్న సీరియల్స్ చూడండి, కాంటెస్ట్లో పాల్గొనండి. ఈ అద్భుత అవకాశం మే 9 నుండి 13 వరకు రాత్రి 7 నుండి 8 గంటల వరకు కేవలం జీ తెలుగులో మాత్రమే!

చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి, రాధకు నీవేరా ప్రాణం అభిమాన ప్రేక్షకుల కోసం జీ తెలుగు ఓ కాంటెస్ట్ నిర్వహిస్తోంది. మే 9 నుండి మే 13 వరకు రాత్రి 07 గంటల నుండి 8 గంటల వరకు ప్రసారమయ్యే, చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి మరియు రాధకు నీవేరా ప్రాణం సీరియల్స్ చూస్తూ 9966034441కి మిస్డ్ కాల్ ఇవ్వండి, ఒక సులువైన ప్రశ్నకి సమాధానం ఇచ్చి విజేతలుగా నిలిచేవాళ్లు నిరుపమ్ పరిటాల మరియు రఘులను వారి మాతృమూర్తులతో సహా కలిసే అవకాశాన్ని పొందుతారు.

ఇక ఈ వారం, చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి సీరియల్ ఆసక్తికరమైన మలుపులతో సాగనుంది. మిత్రని చంపాలని చూసేదెవరు? మనీషా, మిత్ర మధ్య విలన్గా మారేదెవరు? లక్ష్మీ అత్తామామల పెళ్లిరోజు సంబరాల్లో ఏం జరగనుంది?… ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం తెలియాలంటే మీ అభిమాన సీరియల్ చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి చూడాల్సిందే! సోమవారం నుండి శనివారం వరకు ప్రతిరోజు రాత్రి 7 గంటలకు, జీ తెలుగులో మాత్రమే!

మొదటి ఎపిసోడ్ నుంచీ ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంటున్న సీరియల్ రాధకు నీవేరా ప్రాణం. ఇక ఈ వారం మరిన్ని మలుపులతో ఈ సీరియల్ సాగనుంది. రౌడీల నుంచి రాధికను కార్తిక్ కాపాడుతాడా, లేదా? రాధిక కార్తిక్ మనసుని గెలుస్తుందా? కార్తిక్ నిజస్వరూపం రాధికకు తెలిసిపోతుందా? వంటి పలు ట్విస్ట్లతో ఆసక్తికరంగా సాగుతున్న సరికొత్త సీరియల్ రాధకు నీవేరా ప్రాణం సోమవారం నుండి శనివారం వరకు ప్రతిరోజు రాత్రి 7:30 గంటలకు, మీ జీ తెలుగులో!

రాత్రి 07:00 నుండి 08:00 గంటల వరకు చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి & రాధకు నీవేరా ప్రాణం సీరియల్స్ చూడండి.. మీ అభిమాన నటులను కలిసే అవకాశం పొందండి, జీ తెలుగులో మాత్రమే!

Read more RELATED
Recommended to you

Latest news