టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర బుధవారంతో 95వ రోజుకి చేరింది. నేడు నారా లోకేష్ పాదయాత్ర నందికొట్కూరు నియోజకవర్గం బ్రాహ్మణ కోట్కూరులో కొనసాగుతోంది. ఈ సందర్భంగా నారా లోకేష్ మాట్లాడుతూ.. గత ప్రభుత్వం అమలు చేసిన పథకాలను కొనసాగించడం కూడా జగన్ ప్రభుత్వానికి చేతకావడం లేదంటూ ఎద్దేవా చేశారు.
“గత ప్రభుత్వం అమలు చేసిన పథకాలను కొనసాగించడం చేతకాని జగన్ స్టిక్కర్లు వేసుకోవడానికి మాత్రం ఏమాత్రం వెనకాడడం లేదు. పేదల దాహార్తి తీర్చేందుకు నందికొట్కూరు నియోజకవర్గం బ్రాహ్మణ కొట్కూరులో మా ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ సుజల వాటర్ ప్లాంట్ ఇది. ఈ పథకానికి నీళ్లు ఇవ్వకుండా పాడుబెట్టిన వైసీపీ సర్కారు.. తమ పార్టీ స్టిక్కర్లు మాత్రం వేసుకుంటుంది. స్టిక్కర్ల పై ఉన్న శ్రద్ధ సీమ ప్రజలకు నీళ్లు ఇవ్వడం పై లేదేమి జగన్మోహన్ రెడ్డి..?! అని ప్రశ్నించారు నారా లోకేష్.