తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకల ఏర్పాట్లపై సీఎస్‌ శాంతి కుమారి సమీక్ష

-

స్వరాష్ట్రా సాధించికుని దశాబ్ది కాలం గడుస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది తెలంగాణ రాష్ట్ర ఆవిర్భవ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలో దశాబ్ధి ఉత్సవాలకు సంబంధించిన ఏర్పాట్లపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఇవాళ సచివాలయంలో సమన్వయ సమావేశం నిర్వహించారు. జూన్ 2 నుంచి ఇరవై ఒక్క రోజులపాటు రాష్ట్రవ్యాప్తంగా ఈ దశాబ్ది ఉత్సవాలు జరగనున్నాయి. రాష్ట్రం ఏర్పడిన అనంతరం గత తొమ్మిదేళ్లలో ప్రతి శాఖ సాధించిన విజయాలను ప్రతిబింబించేలా తగు ఏర్పాట్లు చేపట్టాలని సీఎస్‌ అధికారులకు సూచించారు. గత తొమ్మిదేళ్లలో వాస్తవాలు, గణాంకాలు, సాధించిన విజయాలను వివరించే డాక్యుమెంటరీలను రాష్ట్ర స్థాయిలో ప్రతి శాఖ తయారు చేయాలని, ముఖ్యమైన పబ్లిక్ స్మారక చిహ్నాలు, భవనాలపై విద్యుత్ అలంకరణ చేయాలని ఆమె ఆదేశించారు.

Shanti Kumari is new Chief Secretary of Telangana, shanti kumari new chief  secretary of telangana

రాష్ట్ర స్థాయిలో జరిగే కార్యక్రమాలతోపాటు జిల్లా, నియోజకవర్గ, మండల స్థాయిల్లో కూడా ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించనున్నారు. 21 రోజులపాటు ఉత్సవాలు సజావుగా నిర్వహించేందుకు పలు సబ్ కమిటీలను ఏర్పాటు చేశారు. ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్‌, జీఏడీ సెక్రెటరీ శేషాద్రి, ఆర్థికశాఖ కార్యదర్శి టీకే శ్రీదేవి, పబ్లిక్‌ ఎంటర్‌ప్రైజెస్‌ కార్యదర్శి నిర్మల, సమాచార పౌర సంబంధాల శాఖ కమిషనర్‌ కే అశోక్‌రెడ్డి, సమాచార పౌర సంబంధాల శాఖ డైరెక్టర్‌ బీ రాజమౌళి, సాంస్కృతిక శాఖ డైరెక్టర్‌ ఎం హరికృష్ణ ఇతర అధికారులు సమావేశంలో పాల్గొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news