రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు ఇటువంటి యజ్ఞం జరగలేదు : కొట్టు సత్యనారాయణ

-

విజయవాడలో ప్రభుత్వం చేపట్టిన యజ్ఞం మూడో రోజు కొనసాగింది. ఈ సందర్భంగా మంత్రి కొట్టు సత్యనారాయణ మాట్లాడుతూ.. నాలుగు ఆగమాలకు సంబంధించిన యాగశాలల యందు మేము సంకల్పించిన దానికన్నా బుత్వికలందరూ కార్యక్రమాల సంఖ్య పెంచుతూ ఘనంగా నిర్వహిస్తున్నారన్నారు. నేడు మూడో రోజు నాలుగు వేదాలకు సంబంధించి వేద పండితులు వేద పట్టాన్ని సీఎం పూర్ణహూతి చేసే సమయంలో పూర్తి చేసే విధంగా ముందుకు వెళ్తున్నారని ఆయన వెల్లడించారు. అంతేకాకుండా.. ‘మేము అనుకున్న సంఖ్యకు ఎక్కువ మంది రుత్వికులు ఈ యజ్ఞంలో పాల్గొన్నారు.. రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు ఇటువంటి యజ్ఞం జరగలేదు.. ప్రతినిత్యం మంగళ వాయిద్యాలతో వేదానికి తగ్గట్లు వాయిస్తూ ఘనంగా నిర్వహిస్తున్నారు.. హనుమాన్ జయంతి సందర్భంగా హనుమాన్ ఛాలీసా ను ఘనంగా నిర్వహించాం..

kottu satyanarayana, ఏపీలోని అన్ని దేవాలయాల్లో ఆన్‌లైన్ సేవలు: మంత్రి  సత్యనారాయణ - minister kottu satyanarayana says that will implement online  services in ap temples - Samayam Telugu

వచ్చే భక్తులకు అన్ని రకాల సదుపాయాలు ఏర్పాటు చేసాం.. యాగానికి వినియోగంచే నెయ్యిని దేశీయ ఆవుల నెయ్యి రాజస్తాన్ నుండి తెప్పించాం.. అత్యంత జాగ్రత్తలతో పవిత్రమైన సంకల్పంతో రాష్ట్ర ప్రజల సంతోషాలు, రాష్ట్ర అభివృద్ధి కోసం నిర్వహిస్తున్నాం.. నేడు అన్నవరం వీర వెంకట సత్యనారాయణ స్వామి కళ్యాణం నిర్వహిస్తాం.. పూర్ణహుతి అనంతరం వేలాది మంది భక్తులకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేసాం.. నేటి నుండి అమ్మవారికి పూజ చేసిన పసుపు కుంకుమ, గాజులను మహిళ భక్తులకు అందిస్తాం.. రేపు లక్ష్మి స్తోత్ర పారాయణం, సప్త నదుల నుండి మూడు సముద్రాలు, మానసారం నుండి జలాలు తెప్పించి అమ్మవారికి అభిషేకాలు నిర్వహిస్తాం.. రేపు సాయంత్రం శ్రీశైలం భ్రమరాంభ అమ్మవారి కళ్యాణం నిర్వహిస్తాం.. రేపు పెద్ద జీయంగార్, పుస్పగిరి పీఠాధిపతులు ప్రవచనాలు జరుపుతాం.’ అని ఆయన అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news