తెలంగాణలో రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమే – భట్టి

-

తెలంగాణలో రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని ధీమా వ్యక్తం చేశారు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క. ఆదివారం మంథని ఎమ్మెల్యే శ్రీధర్ బాబుతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని నేటి పాలకులు దోచుకుంటున్నారని ఆరోపించారు. కేంద్రంలోని బిజెపి, రాష్ట్రంలోని బీఆర్ఎస్ ప్రభుత్వ విధానాల వల్ల ప్రజలు విసిగిపోయి ఉన్నారని.. వారికి బుద్ధి చెప్పడానికి ప్రజలు సిద్ధమయ్యారని అన్నారు. కాంగ్రెస్ పార్టీలో చేరడానికి అనేకమంది నేతలు ఉత్సాహాన్ని చూపిస్తున్నారని.. కానీ వారి పేర్లను బయట పెట్టేందుకు సిద్ధంగా లేమన్నారు.

చేరికలకు సంబంధించి త్వరలోనే కార్యాచరణ ప్రకటిస్తామన్నారు భట్టి. కాంగ్రెస్ సిద్ధాంతాన్ని నమ్మిన వారంతా పార్టీలోకి రావాలని పిలుపునిచ్చారు. ఇక దేశ ఆర్థిక వ్యవస్థను అల్లోకల్లోలం చేసే కుట్రలో భాగంగానే కేంద్రం పెద్ద నోట్లను రద్దు చేసిందని విమర్శించారు. ఇదంతా నరేంద్ర మోడీ ఆడుతున్న వికృత క్రీడ అని దుయ్యబట్టారు భట్టి విక్రమార్క.

Read more RELATED
Recommended to you

Latest news