అవినాశ్ రెడ్డి తల్లిని పరామర్శించిన వైఎస్ విజయమ్మ

-

కర్నూలులోని విశ్వభారతి ఆసుపత్రిలో ట్రీట్మెంట్ తీసుకుంటున్న కడప ఎంపీ అవినాష్ రెడ్డి తల్లి శ్రీలక్ష్మిని వైఎస్ విజయమ్మ పరామర్శించారు. కొంతసేపటి క్రితమే ఆసుపత్రికి చేరుకున్న విజయమ్మ శ్రీలక్ష్మి ఆరోగ్యం గురించి డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. అనంతరం శ్రీలక్ష్మిని పరామర్శించిన విజయమ్మ ఆరోగ్యం గురించి ఆరా తీశారు. కాగా ఇదే ఆసుపత్రిలో అవినాష్ రెడ్డి కూడా ఛాతినొప్పితో అడ్మిట్ అయిన విషయం తెలిసిందే.

YS విజయమ్మతో భేటీ అయిన అవినాష్ రెడ్డి | kadapa mp avinash reddy meet ys  vijayamma in hyderabad - Telugu Oneindia

లక్ష్మమ్మ కుటుంబ సభ్యులతోనూ, డాక్టర్లతోనూ మాట్లాడి ఆమె ఆరోగ్య పరిస్థితిపై వివరాలు తెలుసుకున్నారు. అవినాశ్ రెడ్డి తల్లి త్వరగా కోలుకోవాలని ఆమె ఆకాంక్షించారు. ఆమెకు మెరుగైన చికిత్స అందించాలని పేర్కొన్నారు.
ఇదిలా ఉంటే వైఎస్ వివేకా హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి మరోసారి సీబీఐకి లేఖ రాశారు. ముందస్తు బెయిల్ పై సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయాన్నీ ఈ లేఖలో అవినాష్ తెలిపారు.

 

 

Read more RELATED
Recommended to you

Latest news