‘బిచ్చగాడు-3’పై విజయ్‌ ఆంటోనీ క్లారిటీ

-

బిచ్చగాడు, బిచ్చగాడు-2 సినిమాలతో తెలుగు రాష్ట్రాల్లో ఫుల్ ఫేం సంపాదించుకున్నాడు తమిళ్ హీరో విజయ్ ఆంటోనీ. ఆయన స్వీయ దర్శంకత్వంలో వచ్చిన ఈ రెండు సినిమాలు ఇటు ప్రేక్షకులను అలరిస్తూనే అటు బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించాయి. తాజాగా రిలీజ్ అయిన బిచ్చగాడు-2 రివ్యూలకు భిన్నంగా మౌత్‌టాక్‌తో ప్రేక్షకాదరణ సొంతం చేసుకుంది. బిచ్చగాడు-2 తర్వాత మరో సీక్వెల్ ప్లాన్ చేస్తున్నారని సినీ వర్గాల్లో టాక్. ఈ నేపథ్యంలో ‘బిచ్చగాడు3’పై విజయ్‌ ఆంటోనీ స్పందించాడు.

‘‘బిచ్చగాడు-2’కు కొనసాగింపుగా మూడో భాగం కూడా వస్తుంది. అది పూర్తిగా విభిన్నమైన కథతో తెరకెక్కుతుంది. స్క్రిప్ట్‌ను సిద్ధం చేయడానికి ఏడాదికిపైనే సమయం పట్టవచ్చు. అన్నీ అనుకున్నట్లు జరిగితే 2025లో సినిమాను మొదలు పెడతా. ‘బిచ్చగాడు3’కి కూడా నేనే దర్శకత్వం వహిస్తా’’ అని చెప్పాడు విజయ్.

‘బిచ్చగాడు2’ కథ విషయానికొస్తే, దేశంలోని ధనవంతుల్లో ఒకడైన విజయ్‌ గురుమూర్తి (విజయ్‌ ఆంటోని)ని మోసం చేసి, అతడి మెదడు స్థానంలో సత్య (విజయ్‌ ఆంటోని) అనే బిచ్చగాడి మెదడును అమరుస్తారు. మరి సత్య మెదడు విజయ్‌ గురుమూర్తికి అమర్చాక ఏం జరిగింది? అతనిని అడ్డం పెట్టుకొని విజయ్‌ ఆస్తి దక్కించుకోవాలనుకున్న వారికి సత్య ఎలా బుద్ధి చెప్పాడు? తప్పిపోయిన తన చెల్లిని కనిపెట్టేందుకు అతడు ఏం చేశాడు? తెలియాలంటే సినిమా చూడాల్సిందే!

Read more RELATED
Recommended to you

Latest news