పోస్ట్ ఆఫీస్ లో 12,848 ఉద్యోగాలు..10వ తరగతి పాసైతే చాలు.. రాత పరీక్ష లేదు..!

-

మంచి జాబ్ కోసం చూస్తున్నారా..? అయితే మీకు గుడ్ న్యూస్. నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌ చెప్పింది పోస్టల్ శాఖ. పోస్టల్ డిపార్ట్మెంట్ భారీ నోటిఫికేషన్ ని రిలీజ్ చేసింది. ఆసక్తి, అర్హత వున్నవాళ్లు ఈ పోస్టుల కోసం అప్లై చేసుకోవచ్చు. పదో తరగతి అర్హతతో ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇక దీని కోసం పూర్తి వివరాలు చూస్తే.. భారత తపాలా శాఖ ఇటీవల 40వేలకు పైగా గ్రామీణ్ డాక్ సేవక్ పోస్టులకు నోటిఫికేషన్ ని రిలీజ్ చేసింది. ఇప్పటికే సెలెక్ట్ అయిన అభ్యర్థుల మూడో జాబితాను విడుదల చేసింది. రెండు లేదా మూడు రోజుల్లో నాలుగో జాబితా కూడా విడుదల రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే.

తాజాగా 12,828 ఉద్యోగాల భర్తీకి పోస్టల్ శాఖ మరో నోటిఫికేషన్ ని తీసుకొచ్చింది. వివిధ పోస్టల్‌ సర్కిళ్లలోని బ్రాంచి పోస్ట్‌ ఆఫీసుల్లో గ్రామీణ డాక్ సేవక్ ఖాళీలని నింపేందుకు స్పెషల్‌ సైకిల్‌ మే-2023 ప్రకటన వెలువడింది. ఇందులో స్పెషల్ జీడీఎస్ ఆన్ లైన్ ఎంగేజ్ మెంట్ కింద 5,746 పోస్టులు ని భర్తీ చేస్తున్నారు. అలానే బీపీఎం అండ్ 7,082 ఏబీపీఎం. 10వ తరగతి ఉత్తీర్ణత సాధించిన వాళ్ళు ఈ పోస్టులు కోసం దరఖాస్తు చెయ్యచ్చు. మ్యాథ్స్‌, ఇంగ్లిష్‌, స్థానిక భాష ఉండటం తప్పనిసరి.

ఏపీ, తెలంగాణకు చెందినవారు తెలుగు సబ్జెక్టు పదో తరగతి తప్పక చదవాలి. కంప్యూటర్ పరిజ్ఞానంతో పాటు సైకిల్‌ తొక్కటం కూడా రావాలి. 11-06-2023 నాటికి 18-40 ఏళ్ళు ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, దివ్యాంగులకు పదేళ్లు వయస్సు సడలింపు ఉంటుంది. మెరిట్‌ ప్రకారం అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ట్రాన్స్‌ఉమెన్‌లకు ఏ ఫీజు లేదు. మిగిలిన అభ్యర్థులు రూ.100 చెల్లించాలి. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేదీ జూన్‌ 11, 2023. https://indiapostgdsonline.gov.in/ లో పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news