ఐపీఎల్ క్వాలిఫైయర్ 1 లో చెన్నై మరియు గుజరాత్ టీం లు తలపడుతున్నాయి. టాస్ ఓడిపోయిన చెన్నై మొదట బ్యాటింగ్ చేస్తోంది, ఈ సీజన్ లో అద్భుతంగా రాణిస్తున్న గైక్వాడ్ మరియు కాన్ వే లు ఇన్నింగ్స్ ను నెమ్మదిగా ముందుకు తీసుకువెళుతున్నారు. రెండవ ఓవర్ లోనే అవుట్ అయ్యే ప్రమాదం నుండి బయట పడిన గైక్వాడ్ ఆ తర్వాత తనదైన షాట్ లతో పరుగులు చేస్తున్నాడు. మొదటి పవర్ ప్లే ముగిసే సమయానికి 49 పరుగులకు వికెట్ కోల్పోకుండా ఆడుతోంది. ఇదే విధంగా మరో పది ఓవర్ కనుక ఈ జోడీ ఆడితే చెన్నై ఖచ్చితంగా భారీ స్కోర్ సాధించే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఈ పిచ్ పైన భారీ స్కోర్ ను ఛేదించడం అంత ఈజీ కాదని తెలిసిందే.
పైగా చెన్నైకు స్పిన్ వనరులు మెండుగా ఉన్నాయి. మరి చెన్నై కు వీరిద్దరూ మంచి టార్గెట్ ను సెట్ చేయగలరా అన్నది తెలియాలంటే ఇంకాసేపు వెయిట్ చేయాల్సిందే. ప్రస్తుతం ఋతురాజ్ గైక్వాడ్ 44 పరుగులతో ఆడుతుండగా , కాన్ వే మాత్రం 14 పరుగులతో నెమ్మదిగా ఆడుతున్నాడు.