బఖ్‌ముత్‌ పోరులో 20వేల రష్యా ‘ప్రైవేటు సైనికులు’ మృతి

-

ఉక్రెయిన్‌పై రష్యా భీకర దాడులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఉక్రెయిన్ భూభాగాలను ఆక్రమించుకునేందుకు రష్యా పోరు నిరంతరంగా సాగిస్తోంది. ఇప్పటికే పలు నగరాలు స్వాధీనం చేసుకున్న రష్యా.. ఇటీవల ఉక్రెయిన్​లోని బఖ్​ముత్​ను స్వాధీనం చేసుకున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే కొన్ని నెలలుగా బఖ్​ముత్ నగరంలో భీకర పోరు సాగింది.

ఇందులో రష్యా ప్రైవేటు సైన్యం దాదాపు 20వేల మందిని కోల్పోయినట్లు వాగ్నర్‌ గ్రూపు అధిపతి వెల్లడించారు. అంతేకాకుండా ఉక్రెయిన్‌ యుద్ధంలో పాల్గొనేందుకు నియమించుకున్న మొత్తం 50వేల మంది రష్యన్‌ ఖైదీలలో 20శాతం మంది ప్రాణాలు కోల్పోయారని తెలిపారు.

‘ఉక్రెయిన్‌ నిస్సైనికీకరణ లక్ష్యంతో రష్యా చేస్తున్న సైనిక చర్యను ఉక్రెయిన్‌ సేనలు దీటుగా ఎదుర్కొంటున్నాయి. పాశ్చాత్య దేశాలు అందిస్తున్న ఆయుధ సహాయం, సైనిక శిక్షణతో ఉక్రెయిన్‌ సైన్యం బలంగా మారింది’ అని రష్యా ప్రైవేటు సైన్యం వాగ్నర్‌ గ్రూపు అధిపతి యెవ్‌గెనీ ప్రిగోజిన్‌ పేర్కొన్నారు. యుద్ధం సమయంలో ఎంతో మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news