IPL 2023 : ఫైనల్‌ లో చెన్నై సూపర్ కింగ్స్ ఓటమి…ఫోటో వైరల్‌

-

IPL 2023 : మ్యాచ్ జరగకముందే ఐపీఎల్ ఫైనల్ ఫిక్స్ అయినట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. మ్యాచ్ జరిగే నరేంద్ర మోడీ స్టేడియంలోని బిగ్ స్క్రీన్ పై ‘రన్నరప్ చెన్నై సూపర్ కింగ్స్’ అని పడటంతో ఫైనల్ లో గుజరాత్ టీం గెలవబోతోందని అభిమానులు అనుమానిస్తున్నారు. టెక్నికల్ తప్పిదంతో స్క్రీన్ పై అలా వచ్చినట్లు తెలుస్తుండగా… దీనిపై చెన్నై అభిమానులు మండిపడుతున్నారు.

అంత నిర్లక్ష్యంగా ఎలా అని ప్రశ్నిస్తున్నారు. కాగా, సీఎస్కే, జీటీల మధ్య జరగాల్సిన ఫైనల్ మ్యాచ్ వర్షం కారణంగా వాయిదా పడింది. అయితే ఐపీఎల్ చరిత్రలో ఒక ఫైనల్ మ్యాచ్ వాయిదా పడడం ఇదే తొలిసారి. గత 15 సీజన్లలో ఏ ఫైనల్ మ్యాచ్ కు వర్షం అడ్డంకిగా మారలేదు. దీంతో రిజర్వ్ డేకు మ్యాచ్ వాయిదా పడలేదు. అయితే గత సీజన్లలో వర్షం కారణంగా ఇతర మ్యాచ్లు రద్దు చేయడం లేదా ఓవర్లు కుదించి ఆటను కొనసాగించిన సందర్భాలు ఉన్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news