LIC: రూ.160 పొదుపుతో రూ.75 లక్షలు…!

-

ఎల్ఐసీ ఎన్నో రకాల పాలసీలు తీసుకు వస్తూనే వుంది. చాలా మంది ఈ పాలసీల తో ప్రయోజనాలని పొందుతున్నారు. ఎల్ఐసీ అందిస్తున్న ప్లాన్స్‌లో న్యూ పెన్షన్ ప్లాన్ కూడా ఒకటి. మరి ఇక దీని కోసం పూర్తి వివరాలు చూస్తే.. నాన్ పార్టిసిపేటింగ్ యూనిట్ లింక్డ్ ఇండివీజువల్ పెన్షన్ ప్లాన్ ఇది. ఒకసారి ప్రీమియం చెల్లించి దీనిలో చేరొచ్చు. లేదంటే రెగ్యులర్‌గా ప్రీమియం చెల్లిస్తూ ఉండాలి. ఇలా రెండు ఆప్షన్లు దీనిలో వున్నాయి. ఎంచుకున్న పాలసీ టర్మ్ దాకా ప్రీమియం చెల్లిస్తూ ఉండాలి. టర్మ్ ముగిసిన తర్వాత డిఫర్డ్ యాన్యుటీ ప్లాన్ కొనుగోలు చెయ్యాలి. పాలసీ టర్మ్ ముగిసిన తర్వాత వచ్చే మొత్తంలో 60 శాతాన్ని విత్‌డ్రా చెయ్యచ్చు. మిగిలిన మొత్తంలో యాన్యుటీ ప్లాన్ కొనుగోలు చెయ్యచ్చు.

Life Insurance Corporationlife

నాలుగు ఇన్వెస్ట్‌మెంట్ ఆప్షన్లు దీనిలో ఉంటాయి. అవేమిటంటే పెన్షన్ గ్రోత్ ఫండ్, పెన్షన్ బాండ్ ఫండ్, పెన్షన్ సెక్యూర్డ్ ఫండ్, పెన్షన్ బ్యాలెన్స్డ్ ఫండ్. ప్రీమియం ఆప్షన్ ఎంచుకున్న వారు కనీసం రూ. లక్ష మొత్తానికి పాలసీ ని తీసుకోవాలి. ఒకవేళ రెగ్యులర్ ప్రీమియం ఆప్షన్ ఎంచుకుంటే నెలకు రూ. 3 వేలు లేదా ఏడాదికి ముప్పై వేలు కట్టాలి. 25 ఏళ్ల వయసు వారు ఈ ప్లాన్ ని పొందవచ్చు. 75 ఏళ్ల వరకు వయసు ఉన్న వారు కూడా తీసుకోచ్చు.

నెలకు రూ .5 వేలు కడితే.. పెన్షన్ గ్రోత్ ఆప్షన్ తీసుకుంటే 20 ఏళ్లలో రూ. 23 లక్షలు వస్తాయి. ఇక్కడ 8 శాతం రిటర్న్ ఇది. 4 శాతం రిటర్న్ అయితే రూ. 15 లక్షలు వస్తాయి. 8 శాతం రాబడి ప్రకారం చూస్తే 35 ఏళ్లలో రూ. 75 లక్షలు లభిస్తాయి. రోజుకు రూ. 166 పొదుపు చెయ్యాలి. 4 శాతం రాబడి అయితే రూ. 32 లక్షలు వస్తాయి. నెలకు రూ. 10 వేలు కడితే 20 ఏళ్లలో రూ. 46 లక్షలు వస్తాయి. 4 శాతం రిటర్న్ అయితే రూ. 30 లక్షలు పొందొచ్చు. 15 ఏళ్లలో 8 శాతం రాబడి ప్రకారం రూ. 28 లక్షలు వస్తాయి. 4 శాతం రాబడి ప్రకారం రూ. 21 లక్షలు. సింగిల్ ప్రీమియం ఆప్షన్ కింద రూ. 50 లక్షలు పెడితే పదేళ్లలో రూ. 93 లక్షలు ని మీకు వస్తాయి.

 

Read more RELATED
Recommended to you

Latest news