మంథనిలో హోరాహోరీ..శ్రీధర్‌కు టఫ్..బీఆర్ఎస్‌లో లొల్లి.!

-

పెద్దపల్లి జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి కంచుకోట అంటే డౌట్ లేకుండా మంథని నియోజకవర్గం గురించి చెప్పేయొచ్చు. మాజీ ప్రధాని పీవీ నరసింహారావు పోటీ చేసి గెలిచిన స్థానం ఇది. 1952లో ఏర్పడిన ఈ స్థానంలో మొదట సోషలిస్ట్ పార్టీ గెలిచింది..ఇక తర్వాత నుంచి కాంగ్రెస్ హవా మొదలైంది. 1957 నుంచి 1972 వరకు పీవీ కాంగ్రెస్ నుంచి నాలుగుసార్లు గెలిచారు. 1978లో సైతం కాంగ్రెస్ గెలిచింది. టీడీపీ హవా ఉన్న 1983, 1985 ఎన్నికల్లో సైతం అక్కడ కాంగ్రెస్ పార్టీ సత్తా చాటింది. 1989లో కాంగ్రెస్ హవానే. ఒక్క 1994లో మాత్రం టి‌డి‌పి గెలిచింది.

1999, 2004, 2009 ఎన్నికల్లో వరుసగా కాంగ్రెస్ నుంచి శ్రీధర్ బాబు విజయం సాధించారు. తెలంగాణ వచ్చాక జరిగిన 2014 ఎన్నికల్లో బి‌ఆర్‌ఎస్ నుంచి పుట్టా మధు విజయం సాధించారు. మళ్ళీ 2018లో శ్రీధర్ బాబు కాంగ్రెస్ నుంచి గెలిచారు. ఈ సారి ఎన్నికల్లో కూడా శ్రీధర్ బాబు పోటీ చేయడానికి రెడీ అవుతున్నారు. మళ్ళీ పోటీ చేసి సత్తా చాటాలని చూస్తున్నారు. కాకపోతే గత ఎన్నికల మాదిరిగా ఈసారి సులువుగా గెలవడం కష్టమే.

శ్రీధర్ గట్టి పోటీ ఎదుర్కోవాల్సిన పరిస్తితి ఉంది. బి‌ఆర్‌ఎస్ పార్టీ నుంచి టఫ్ ఫైట్ తప్పదు. కాకపోతే బి‌ఆర్‌ఎస్ పార్టీలో సీటు కోసం లొల్లి నడుస్తుంది. గత ఎన్నికల్లో ఓడిపోయిన పుట్టా మధు..జెడ్పీ ఛైర్మన్ గా ఉన్న విషయం తెలిసిందే. ఆయనే నెక్స్ట్ పోటీకి రెడీ అవుతున్నారు. ఇదే సమయంలో కాటారం సింగిల్ విండో ఛైర్మన్ చల్లా నారాయణ రెడ్డి సైతం అధిష్టానం ఆదేశిస్తే తాను పోటీకి రెడీ అని ప్రకటించారు.

సీఎం కే‌సి‌ఆర్ దగ్గర బంధువు ద్వారా సీటు ట్రై చేస్తున్నారని తెలిసింది. ఇటు అధిష్టానం ఆశీస్సులు తనపైనే ఉన్నాయని మధు అంటున్నారు. ఇద్దరు నేతలు పోటాపోటిగా కార్యక్రమాలు చేస్తున్నారు. దీంతో అధిష్టానం ఇంటిలిజెన్స్‌ని రంగంలోకి దింపింది..సర్వే చేయించి ఎవరికి ప్రజా బలం ఉందో వారికే సీటు ఇవ్వాలని చూస్తుంది. ఏదేమైనా ఈ సారి మంథనిలో పోరు రసవత్తరంగా సాగనుంది.

Read more RELATED
Recommended to you

Latest news