ఒడిస్సా రైలు ప్రమాదం..బీజేపీ ఉత్సవాలు రద్దు

-

ఒడిస్సా రైలు ప్రమాదం నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఇవాళ బిజెపి నిర్వహిస్తున్న కార్యక్రమాలు రద్దు చేస్తున్నట్లు… ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కీలక ప్రకటన చేశారు. బిజెపి ప్రభుత్వం ఏర్పడి నేటికీ.. 9 ఏళ్లు పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ తరుణంలోనే దేశంలోని అన్ని రాష్ట్రాలలో ఉత్సవ వేడుకల నిర్వహించాలని బిజెపి అధిష్టానం నిర్ణయం తీసుకుంది.

అయితే ఒడిస్సా రైలు ప్రమాదం తరుణంలో ఆ వేడుకలను రద్దు చేయాలని జేపీ నడ్డా పిలుపునిచ్చారు. అలాగే మృతుల కుటుంబాలకు సానుభూతి ప్రకటించారు నడ్డా. కాగా,కోరమండల్ ఎక్స్ ప్రెస్ రైలు ప్రమాద సంఘటన నేపథ్యంలో ఒడిస్సా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇవాళ ఒడిస్సా రాష్ట్రంలో సంతాప దినంగా ప్రకటించనుంది. ఈ మేరకు ఎలాంటి అవతరణ దినోత్సవ వేడుకలు నిర్వహించకూడదని.. రాష్ట్ర ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. కాగా మరికాసేపట్లోనే ఒడిస్సా రాష్ట్ర ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ సంఘటన స్థలానికి చేరుకుని… అక్కడ జరుగుతున్న సహాయక చర్యలను పర్యవేక్షించనున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news