ప్రధాని మోడీపై కాంగ్రెస్ నేత ఆసక్తికర వ్యాఖ్యలు

-

ప్రధాని మోడీపై కాంగ్రెస్‌ నేత ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ నేత శామ్ పిట్రోడా ఇవాళ మాట్లాడుతూ.. నరేంద్ర మోదీ భారత దేశానికి ప్రధాని కావడం వల్లే ఆయనకు గౌరవం లభిస్తోందని, అంతే తప్ప బీజేపీ వల్ల కాదని అన్నారు. ప్రధానికి ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఆదరణ లభిస్తోందని ఎవరో తనతో చెప్పారని, అందుకు తాను ఎంతో సంతోషంగా ఉన్నానని చెప్పారు. ఎందుకంటే ఆయన తనకు కూడా ప్రధానియే అన్నారు. కానీ మనం ఎప్పుడు కూడా తప్పు చేయవద్దని, మోదీ భారత ప్రధాని అయినందున ఆయనకు ఆదరణ లభిస్తోందన్నారు. కానీ ఆయన బీజేపీకి చెందడం వల్ల కాదని గుర్తించాలన్నారు. ఈ రెండింటిని వేర్వేరుగా చూడాలన్నారు.

PM Modi Announces Rs 2 Lakh For Families Of Odisha Accident Victims

1.5 బిలియన్ల జనాభా ఉన్న దేశ ప్రధానికి ప్రతిచోటా గౌరవం లభించాలని, తాను దాని గురించి గర్వపడుతున్నానని చెప్పారు శామ్ పిట్రోడా. ఆయనకు ప్రపంచవ్యాప్తంగా ఆదరణ లభిస్తున్నందుకు తాను వ్యతిరేకంగా లేనన్నారు. కానీ అధికార పార్టీ వారు ప్రతి సందేశాన్ని ట్విస్ట్ చేస్తారని, గందరగోళానికి గురి చేస్తారన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news