48 గంటలు.. 1,500 కార్మికులు.. రెస్ట్ లేకుండా కష్టపడి రెండు రైల్వే లైన్లు పునరుద్ధరణ

-

దేశంలోనే అత్యంత తీవ్ర విషాదంగా నిలిచింది ఒడిశా రైలు ప్రమాదం. ప్రస్తుతం ఈ ప్రమాదం నుంచి కోలుకోవడంపై దృష్టి పెట్టాయి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు. ఓవైపు క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందిస్తూ.. మరోవైపు మృతుల కుటుంబాలకు అండగా నిలుస్తూ.. ఇంకోవైపు ఈ ప్రమాదం జరిగిన రైల్వే లైన్‌ను పునరుద్ధరించడంపై ఫోకస్ చేస్తున్నాయి. రైల్వే లైన్ల పునరుద్ధరణకు ఆగ్నేయ రైల్వేతో పాటు తూర్పు కోస్తా రైల్వే, అధికారమంతా రంగంలోకి దిగింది.

సుమారు 1,500 మందికి పైగా కార్మికులు, ఇంజినీర్లు, సాంకేతిక నిపుణులు 48 గంటలుగా నిర్విరామంగా క్షేత్ర స్థాయిలో పనులు చేస్తున్నారు. తొలి రోజు నుంచి తీరిక లేకుండా పనిచేస్తున్న.. సిబ్బంది స్థానంలో పని చేయడానికి వాల్తేరు డివిజన్ నుంచి ఆదివారం 280 మంది సి‌బ్బందితో.. ప్రత్యేక రైలు బహనాగ బజార్ రైల్వేస్టేషన్‌కు చేరుకుంది. ఒడిశా, బంగాల్ రైల్వే ఉన్నతాధికారులు, వాల్తేరు డీఆర్‌ఎం అనూప్ శత్పథి పునరుద్ధరణ పనులు పర్యవేక్షిస్తున్నారు. ప్రమాదం జరిగిన 51 గంటల తర్వాత డౌన్‌లైన్ పునరుద్ధరించారు. తర్వాత రెండు గంటలకే అప్‌లైన్ కూడా సిద్ధమైంది.

Read more RELATED
Recommended to you

Latest news