తెలంగాణ విద్యుత్ రంగం సాధించిన విజయం..

-

తెలంగాణ విద్యుత్ రంగం సాధించిన విజయం.. వినూత్నం.. విశిష్టమని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ పునరుద్ఘాటించారు. తెలంగాణ విద్యుత్ ప్ర‌గ‌తి నిత్య కోత‌ల నుంచి నిరంత‌ర వెలుగుల ప్ర‌స్థానానికి చేరుకుంద‌ని ట్వీట్ చేశారు. తెలంగాణ ఏర్పడినప్పుడు రాష్ట్రంలో ఆవరించి ఉన్న చిమ్మ చీకట్లను చీల్చుకుంటూ, విద్యుత్తు రంగంలో అద్భుత రీతిలో పురోగతి సాధించామని అన్నారు. దేశానికే దారిచూపే టార్చ్‌ బేరర్‌గా నిలిచిందని కొనియాడారు.

నేడు యావత్‌ భారతదేశంలో కరెంటు కోతలు లేని ఒకే ఒక రాష్ట్రం తెలంగాణ నిలిచిందని కేటీఆర్ అన్నారు. మండు వేసవిలో సైతం అన్ని రంగాలకు 24 గంటల పాటు నాణ్యమైన విద్యుత్తును అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని కేటీఆర్ కొనియాడారు. దేశంలోనే తొలిసారిగా రికార్డు సమయంలో (48 నెలలు) పాల్వంచ లోని కేటీపీఎస్ 7వ దశ 800 మెగావాట్ల సూపర్ క్రిటికల్ థర్మల్ కేంద్రం నిర్మాణం పూర్తి చేసుకుని విద్యుదుత్పత్తి ప్రారంభం చేశామని చెప్పారు. ఆర్థిక, పారిశ్రామిక, ఐటీ లాంటి అన్ని రంగాలకూ గుండెకాయలాంటి హైదరాబాద్‌ను సీఎం కేసీఆర్‌ ‘పవర్‌ ఐలాండ్‌’గా మార్చారని కేటీఆర్ ట్వీట్ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news