రైలు ప్రమాదంలో ఏపీకి చెందిన 342 మందిని గుర్తించామని ప్రకటన చేశారు ఏపీ మంత్రి అమర్ నాథ్. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఆదేశాలతో నేను, అధికారులు ప్రమాద ఘటనా ప్రాంతానికి వెళ్ళామని ప్రకటించారు. రెండు రైళ్ళల్లో మొత్తం 342 మంది ఏపీకి చెందిన వారిని గుర్తించామని.. 9 మందికి విశాఖలో చికిత్స జరుగుతుందని వెల్లడించారు. రిజర్వ్ కాంపార్ట్‌మెంట్ లో 5 గురు ప్రయాణం చేసినట్లు గుర్తించామని… 276 మంది చనిపోయినట్లు ఒరిస్సా ప్రభుత్వం ప్రకటించిందన్నారు.
187 మృతదేహాలను ఇంకా గుర్తించాల్సి ఉందని వివరించారు. ఇక అటు ఒడిశాలోని బాలోసోర్ సమీపంలో రైలు ప్రమాద దుర్ఘటన, అధికారులు తీసుకుంటున్న చర్యలపై సీఎం వైయస్.జగన్ సమీక్షించారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం నుంచి ఒడిశాకు వెళ్లిన మంత్రి అమర్‌నాథ్ నేతృత్వంలోని ప్రత్యేక బృందం తీసుకుంటున్న చర్యలను వివరించారు. విశాఖపట్నంలో మరో మంత్రి బొత్స సత్యన్నారాయణ నేతృత్వంలో పర్యవేక్షణ కార్యకలాపాలను అధికారులు సీఎంకు వివరించారు. ఈ ఘటనలో రాష్ట్రానికి చెందిన వారు ఎవరైనా మరణిస్తే వారి కుటుంబానికి రూ.10 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని సీఎం ఆదేశాలు ఇచ్చారు.