రైల్ ప్రమాదంలో చనిపోయిన కుటుంబంలో ఒక్కరికి ప్రభుత్వ ఉద్యోగం…

-

గత మూడు రోజుల క్రితం ఒడిశా రాష్ట్రము బాలాసోర్ సరిహద్దుల్లో మూడు రైళ్లు ఢీకొనడంతో భారీ రైలు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ దుర్ఘటనలో 300 మందికి పైగా ప్రాణాలను కోల్పోగా , చాలా మంది గాయాలు పాలయ్యారు. కాగా ఈ ఘటనపై దేశం లోని పలు రాష్ట్రాల సీఎంలు మరియు అధికార ప్రతినిధులు తమ సంతాపాన్ని తెలియచేశారు. ఇక వెస్ట్ బెంగాల్ కు చెందిన వారు కూడా ఈ ట్రైన్ లో ప్రయాణించడంతో, ఆ రాష్ట్ర సీఎం మమతా బెనర్జీ ఇందులో ప్రాణాలు కోల్పోయిన లేదా గాయపడిన వారికి ఉపయోగకరమైన హామీని ఇచ్చింది. ఇందులో మరణించిన కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగాన్ని కల్పిస్తామని హామీ ఇచ్చింది.

 

 

 

అదే విధంగా ప్రమాదంలో గాయపడి అవయవాలను కోల్పోయిన వారికి కూడా అదే హామీని అమలు చేస్తామని సీఎం తెలిపింది. అతి త్వరలోనే వీరికి నష్టపరిహారంతో పాటుగా నియామక పాత్రలను అందిస్తామని మాటిచ్చింది.

Read more RELATED
Recommended to you

Latest news