“రొమాంటిక్‌” లో సీనియర్ హీరోయిన్ ఎంట్రీ ?.. ఇక రచ్చ రచ్చేనా..?

-

డైరెక్టర్ పూరి జగన్నాథ్ కుమారుడు ఆకాష్ పూరి హీరోగా రొమాంటిక్ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. నూతన దర్శకుడు అనిల్ పాదూరి దర్శకత్వంలో వస్తోందీ సినిమా. ఈ సినిమాలో ఆకాశ్ పూరి సరసన కేతికా శ‌ర్మ హీరోయిన్ గా నటిస్తోంది. రీసెంట్ గా విడుదలైన ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ బాగా వైరల్ అయ్యింది.

హీరోయిన్ కేతిక టాప్ లెస్ గా హీరోని కౌగిలించుకోవడం.. ఘాటు ప్రేమలో ప్రపంచాన్ని మర్చిపోయిన ప్రేమ జంటగా వీరిద్దరూ కనిపించడంతో పోస్టర్ యూత్ ను బాగా ఆకట్టుకుంది. ఈ సినిమా మాఫియా నేపథ్యంలో తెరకెక్కుతోందట. ఇప్పుడు ఈ సినిమా కు సంబంధించిన లేటెస్ట్ అప్ డేట్ ఇంట్రస్టింగ్ గా మారింది. ఈ సినిమాలో సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ ఎంట్రీ ఇస్తున్నారట. ఏదో గెస్ట్ క్యారెక్టర్ కాకుండా రమ్యకృష్ణ ఫుల్ లెంత్ క్యారెక్టర్ చేయనున్నట్టు తెలుస్తోంది.

రమ్యకృష్ణ ఎంట్రీతో ఈ సినిమా పై అంచనాలు మరింతగా పెరిగిపోవడం ఖాయంగా కనిపిస్తోంది. ఇస్మార్ట్ శంకర్ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత పూరీ, ఛార్మి సంయుక్త నిర్మాణంలో వస్తున్న ఈ సినిమా ఇప్పుడు రమ్యకృష్ణ ఎంట్రీతో మరింత ఇంట్రస్టింగ్ గా మారే ఛాన్సులు కనిపిస్తున్నాయి. ఇప్పటి వరకూ సరైన హిట్ లేని ఆకాష్ పూరికి ఈ సినిమా అయినా బ్రేక్ ఇస్తుందేమో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news