గురువారం జహీరాబాద్ నియోజకవర్గంలోని ఝరాసంగం జర్నలిస్టులకు ఇండ్ల స్థలాల పట్టాలను జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్ రావు,ఎంపీ బీబీ పాటిల్, ఉమ్మడి మెదక్ జిల్లా డీసీఎంఎస్ చైర్మన్ మల్కాపురం శివకుమార్ తో కలిసి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సమావేశంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు ప్రసంగించారు. ప్రజలకు వాస్తవాలను చెప్పే బాధ్యత జర్నలిస్టులదాని అన్నారు ఆయన. ఆ దిశగా వారు పనిచేయాలని రాష్ట్ర ఆర్థిక, అన్నారు ఆయన. తెలంగాణ రాష్ట్ర ఉద్యమంఉద్యమ సమయంలో జర్నలిస్టులు సేవలను గుర్తు చేశారు మంత్రి హారిష్.
తెలంగాణ వచ్చిన తర్వాత జర్నలిస్టులకు అక్రిడేషన్ కార్డులను అందించిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వందే అని పేర్కొన్నారు ఆయన. దేశంలో ఎక్కడ లేని విధంగా ముఖ్యమంత్రి కేసిఆర్ జర్నలిస్టుల సంక్షేమం కోసం 100 కోట్ల రూపాయలు మంజూరు చేసినట్లు వెల్లడించారు ఆయన. కరోనాతో మరణించిన జర్నలిస్టు కుటుంబాలను తెలంగాణ ప్రభుత్వం పింఛన్ ఇచ్చి ఆదుకుంటున్నారు అన్నారు. ఈ కార్యక్రమంలో నయాబ్ తహసిల్దార్ రాజిరెడ్డి,గిర్దవారి రామారావు, సిబ్బంది యాసిన్,జర్నలిస్టులు సుధాకర్, మహేష్,మల్లన్న, సిద్ధన్న, సుధాకర్ రెడ్డి,అనిల్ కుమార్,రాజ్ శేఖర్, చిరంజీవి, సంగమేశ్వర్, సోమయ్య స్వామి తదితరులు పాల్గొన్నారు.