డబుల్ ఇంజన్ అంటే ఆదానీ, ప్రధాని – రేవంత్ రెడ్డి

-

యూత్ కాంగ్రెస్ జాతీయ కార్యవర్గ సమావేశంలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆసక్తి కర వ్యాఖ్యలు చేశారు. పోరాడే వారికే భవిష్యత్ ఉంటుందని.. రాజకీయ భవిష్యత్ కు యూత్ కాంగ్రెస్ ఒక మంచి వేదిక అని తెలిపారు. నాయకుడుగా మారడానికి యూత్ కాంగ్రెస్ ఒక వేదిక అని.. ఇందుకు ఇంచార్జ్ మాణిక్ రావ్ ఠాక్రే గారే మనకు ఉదాహరణ అంటూ ఆసక్తి కర వ్యాఖ్యలు చేశారు.

1200 మంది విద్యార్థి, యువత ప్రాణత్యాగాలతో తెలంగాణ ఏర్పడిందని.. డబుల్ ఇంజన్ అంటే ఆదానీ, ప్రధాని అని ఫైర్‌ అయ్యారు. దేశాన్ని దోచుకోవడమే ఈ డబుల్ ఇంజన్ పని అని.. వన్ నేషన్ వన్ పార్టీ అనేది బీజేపీ రహస్య ఎజెండా అని ఆగ్రహించారు. బీజేపీ కుట్రలను ఛేదించి దేశంలో కాంగ్రెస్ జెండా ఎగరేయాలని… సెప్టెంబర్ 17 న కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేద్దామని వెల్లడించారు.

త్వరలోనే ఎన్నికలు రాబోతున్నాయని… ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు కోసం మీరంతా కష్టపడాలని కోరారు రేవంత్‌ రెడ్డి. తెలంగాణలో కేసీఆర్ ను ఓడించి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేయాలని.. డిసెంబర్ 9 న సోనియా జన్మదినం అని గుర్తు చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ ను గెలిపించి సోనియాకు కానుకగా ఇవ్వాలని కోరారు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి.

Read more RELATED
Recommended to you

Latest news