తెలంగాణ అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ప్రజలకు బిగ్ అలర్ట్. ఇవాళ భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. తెలుగు రాష్ట్రాల్లో ఉండబోత వర్షాలు ఉన్నాయని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు పడతాయని కూడా వార్నింగ్ ఇవ్వడం జరిగింది.

తెలంగాణ రాష్ట్రంలోని ఆసిఫాబాద్, ఆదిలాబాద్, మంచిర్యాల, నిజామాబాద్, నిర్మల్, పెద్దపల్లి, వరంగల్, కరీంనగర్, సిరిసిల్ల, కొత్తగూడెం, మహబూబాబాద్, కామారెడ్డి, జనగామ, సిద్దిపేట, భూపాలపల్లి, నిర్మల్ జిల్లాలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. అదే సమయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న అల్లూరి, కృష్ణ, ఏలూరు, ఎన్టీఆర్, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, బాపట్ల, పలనాడు, గుంటూరు, ప్రకాశం జిల్లాలో అతి భారీ వర్షాలు పడతాయని అమరావతి వాతావరణ శాఖ స్పష్టం చేసింది.