“కష్టం ఒకరిదైతే..ప్రచారం మరొకరిది” అనే సామెత అబద్ధాల కేసీఆర్ కి సరిపోతుందని ఎద్దేవా చేశారు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. పాలమూరు కనీళ్లను చూసి సాగునీళ్ళు ఇచ్చింది వైస్సార్ అయితే.. తట్టెడు మట్టి మోయని కెసిఆర్.. తానే జలకళ తెచ్చినట్లు గఫ్ఫాలు కొట్టుకుంటున్నడని ఆరోపించారు. అందుకే “సొమ్మొకడిది – సోకొకడిది అంటారని చురకలాంటించారు. ఎన్నికల వేళ సోకు మాటలు చెప్పే దద్దమ్మ గారు.. పాలమూరు ప్రాజెక్టులపై బహిరంగ చర్చకు సిద్ధమా ? అని సీఎం కేసీఆర్ కి సవాల్ విసిరారు షర్మిల.
పడావు బడ్డ బీడు భూముల్లో కృష్ణా జలాలు పారించిన ఘనత ఎవరిదో చర్చకు రాగలరా.? అని నిలదీశారు. YSR జలయజ్ఞం కింద వేసిన పునాదులే.. నేడు కెసిఆర్ చెప్తున్న 20 లక్షల ఎకరాలకు సాగునీళ్ళు ఇచ్చే ప్రాజెక్టులన్నారు. కల్వకుర్తి ద్వారా 4 లక్షల ఎకరాలు, భీమా కింద 2 లక్షల ఎకరాలకు, నెట్టెంపాడుతో 2 లక్షల ఎకరాలు, కోయిల్ సాగర్ కింద 60 వేల ఎకరాలు, గట్టు, తుమ్మిల్ల, సంగంబండ ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో రిజర్వాయర్లు.. YSR హయాంలో 20 లక్షల ఎకరాలకు సాగునీరు ఇస్తే.. మీ పదేళ్ల పాలనలో ఒక్క ఏకరాకు అదనంగా సాగునీరు ఇచ్చారా దొర గారు..? అని ప్రశ్నించారు.