ఉమ్మి అమ్మి లక్షల్లో సంపాదిస్తున్న యువతి.. ఇదేం పిచ్చిరా బాబు..!

-

డబ్బులు ఊరికే రావని అందరూ అంటారు. కానీ కొంతమందిని చూస్తే.. డబ్బులు సంపాదించడం తేలికే అనిపిస్తుంది. ఇలా కూడా డబ్బులు సంపాదిస్తారా అనిపిస్తుంది.! ఎవరూ ఊహించని ఇలాంటి మార్గంలోనే లతీషా జోన్స్ అనే యువతి మనీ ఎర్న్‌ చేస్తోంది. ఎంతగా అంటే.. తన అప్పులు తీర్చి, ఫ్లాట్‌ కూడా కొనుగోలు చేసింది. ఇంతకీ ఆమె ఎంచుకున్న మార్గం ఏంటో తెలుసా? నోటి ఉమ్మి(స్పిట్‌)తో నింపిన బాటిల్స్‌ను అమ్మడం.

లతీషా జోన్స్
లతీషా జోన్స్

ఇంగ్లాండ్‌కు చెందిన లతీషా జోన్స్, 22 ఏళ్ల బయోమెడికల్ సైన్స్ విద్యార్థి. ఆమె మాంచెస్టర్‌లోని టెస్కోలో తన ఖర్చులు, ఎడ్యుకేషన్ ఫీజు కోసం పార్ట్‌టైమ్ జాబ్‌ చేస్తోంది. ఉమ్మి, గోళ్ళ క్లిప్పింగ్‌లు, వారం రోజుల పాటు వాడిన బెడ్‌షీట్‌లు వంటి అసాధారణ వస్తువులకు డిమాండ్ ఉందని జోన్స్ అంటుంది.. ఇలాంటి వాటికి ప్రజలు ఏకంగా £300 (రూ.30,000) నుంచి £1,500 (రూ. 1.5 లక్షలు) వరకు చెల్లించడానికి సిద్ధంగా ఉన్నారని ఆమె గుర్తించింది. దీంతో ఆమె పార్ట్ టైమ్ జాబ్ వదిలేసి యూనివర్సిటీ నుంచి బయటకు రావాలని కూడా నిర్ణయించుకుంది.

పాపులర్‌ అయిన ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్ ఓన్లీ ఫ్యాన్స్‌(OnlyFans)ను చూస్తున్నప్పుడు, ఫాలోవర్స్ నుంచి షవర్ వాటర్‌తో పాటు ఇతర వింత రిక్వెస్ట్‌లను చూసినట్లు ఆమె చెప్పింది. మొదట ఆశ్చర్యపోయినా ఆసక్తి కొద్దీ వీటిపై ఆమె మరింత రీసెర్చ్‌ చేసింది. యూనిక్‌ ఐటెమ్స్‌ సేల్‌ గురించి తెలుసుకుంది. మొత్తానికి దీన్నే ఆమె భారీగా డబ్బు సంపాదించే మార్గంగా మార్చుకుంది.

ఉమ్మి కోసం రిక్వెస్ట్

తన కస్టమర్ల డిమాండ్‌లను తీర్చడానికి, జోన్స్ చాలా రిసెర్చ్ చేసిందట. ముందు కొందరు వ్యక్తులు ఆమెను స్పిట్‌ బాటిల్‌ అడిగారట. అప్పుడు ఆమె తిరస్కరించింది. జోక్‌గా ఇలా చేస్తున్నారని భావించింది. అయితే వెంటనే తన ఉమ్మి కోసం వచ్చిన రిక్వెస్ట్‌ నిజమైనదని తెలుసుకుంది. తర్వాత తన స్పిట్‌ బాటిల్‌కి £300 వసూలు చేసింది.

ఇదేం పిచ్చిరా నాయనా..?

క్రమంగా జోన్స్‌కి అనేక ఇతర రిక్వెస్ట్‌లు వచ్చాయి. ఆమె వారం పాటు పడుకున్న బెడ్‌షీట్స్ నుంచి చెమటతో తడిచిపోయిన జిమ్ దుస్తులు, బాత్‌వాటర్, టూత్ బ్రష్‌లు, టూత్‌పేస్ట్ స్పిట్‌.. ఇలా అన్నింటికీ మంచి డిమాండ్ ఉంది. వీటన్నింటికి ఆమె భారీగా డబ్బులు వసూలు చేస్తుంది. జోన్స్ కేవలం తన ఉమ్మి ద్వారా సంపాదించిన అత్యధిక మొత్తం £1,500(రూ.1.5 లక్షలు). దీంతో విచిత్రమైన వాటి కోసం పెద్ద మొత్తంలో చెల్లించడానికి ఇష్టపడే వారు కూడా ఉన్నారని తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news