షారుఖ్‌ను బలవంతంగా కిస్ చేసిన యువతి.. వీడియో వైరల్‌

-

బాలీవుడ్‌ బాద్‌షా షారుఖ్‌ ఖాన్‌ తాజాగా ఓ ఈవెంట్​కు హాజరయ్యారు. ఈ ఈవెంట్​లో షారుఖ్ ఫ్యాన్ అయిన ఓ అమ్మాయి.. షారుఖ్​ను కలిసేందుకు వచ్చింది. ఈవెంట్​లో షారుఖ్ ఎంటర్ అవ్వగానే అతడి వద్దకు వెళ్లి బలవంతంగా ముద్దు పెట్టేసింది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది.

దుబాయ్‌ వేదికగా జరిగిన ఓ కార్యక్రమంలో మంగళవారం షారుఖ్‌ పాల్గొన్నాడు. కార్యక్రమం అనంతరం అక్కడి అభిమానులను కలిశాడు. కొంతమంది ఆయనను ప్రేమగా షారుఖ్​ను హగ్ చేసుకోగా.. మరి కొంతమంది ఆయనతో ఫొటోలు దిగారు. అయితే.. ఓ మహిళా షారుఖ్‌ వద్దకు చేరుకుని ‘మిమ్మల్ని ముద్దుపెట్టుకోవచ్చా?’ అని అడిగింది.

సమాధానం చెప్పేలోపే ఆయన బుగ్గపై బలవంతంగా ముద్దుపెట్టింది. తన అభిమాన హీరోని ముద్దుపెట్టుకున్నానన్న ఆనందంతో వెంటనే అక్కడి నుంచి వెళ్లిపోయింది. అయితే, అభిమాని చేసిన పనితో షారుఖ్‌ కాస్త ఇబ్బందిగా కనిపించారు. దీనికి సంబంధించిన ఓ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

 

Read more RELATED
Recommended to you

Latest news