వారిస్ పంజాబ్ దే అధినేత అమృత్ పాల్ సింగ్ బాస్.. ఖలిస్థాన్ లిబరేషన్ ఫోర్స్ నేత.. బ్రిటన్‌లో భారతీయ జెండాను అవమానించిన.. అవతార్ సింగ్ ఖండా ఇవాళ మరణించాడు. క్యాన్సర్‌తో పోరాడుతున్న అవతార్.. తీవ్ర అస్వస్థతతో యూకేలోని ఓ ఆస్పత్రిలో మృతి చెందాడు. అమృత్‌పాల్ సింగ్‌కు పరారీ సమయంలో ఇతడే సాయం చేశాడు. తీవ్ర అస్వస్థతతో బర్మింగ్‌హామ్‌లోని ఓ వైద్యశాలలో సోమవారం చేరాడు. పరిస్థితి విషమించడంతో నేడు మృతిచెందాడు. కొన్ని వార్తా సంస్థలు విషప్రయోగం అని చెబుతుండగా.. మరికొన్నింటిలో బ్లడ్ క్యాన్సర్‌గా పేర్కొంటున్నారు. అవతార్ సింగ్ గతంలో అమృత్‌సర్ శిరోమణి అకాలీదళ్‌తో సన్నిహిత సంబంధాలు నెరిపాడు.
యూకేలో భారత హైకమిషన్ కార్యాలయంపై త్రివర్ణ పతాకాన్ని అవమానించిన ఘటనలో లండన్ పోలీసులు అవతార్ సింగ్‌ను అరెస్టు చేశారు. దీంతోపాటు మార్చి 19న భారత హైకమిషన్ కార్యాలయ విధ్వంసానికి కుట్రపన్నిన వారిలో అవతార్ పాత్రపై ఎన్‌ఐఏ దర్యాప్తు జరుపుతోంది. అంతేకాదు ఇంగ్లాండ్‌లో ప్రార్థనా మందిరాల్లో ఇతడు బాంబుల తయారీపై శిక్షణ ఇస్తాడనే ఆరోపణలున్నాయి.