వైసిపి ప్రభుత్వం పై మరోసారి తీవ్ర విమర్శలు చేశారు టిడిపి నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు. విశాఖలో రౌడీయిజం లేదని, భూ కబ్జాలు లేవని డిజిపి చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాలకు విశాఖలో జరిగిన కిడ్నాప్ ఘటనే పరాకాష్ట అని అన్నారు. నాలుగేళ్లగా విశాఖలో లుంగీ బ్యాచ్ పంచాయితీలు జరుగుతున్నాయని మండిపడ్డారు.
హనుమాయమ్మ సంఘటన జరిగిన రోజే ముఖ్యమంత్రి స్పందించి ఉంటే ఈ ఘటనలు జరిగేవి కావని ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి నోరు తెరిచి మాట్లాడితే అమర్నాథ్ పై పెట్రోల్ పోసి చంపే వాళ్లా..? అని ప్రశ్నించారు. ఇక తిరుమల తిరుపతి కొండ కిందే అరాచకాలు జరుగుతున్నాయని ఆరోపించారు. ఎంపీ అవినాష్ రెడ్డి విచారణలో భాగంగా నెలాఖరులోగా తాడేపల్లి కొంపకు నోటీసులు వస్తాయని హెచ్చరించారు.