పవన్ కళ్యాణ్ కంటే బ్రహ్మానందం బెటర్ – అంబటి రాంబాబు

-

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై మరోసారి తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు మంత్రి అంబటి రాంబాబు. పవన్ కళ్యాణ్ మానసిక స్థితి సరిగాలేదని వ్యంగ్యాస్త్రాలు సందించారు. వారాహి వాహనం ఎక్కిన దగ్గర నుండి పవన్ కళ్యాణ్ పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నాడని అన్నారు. వారాహి వాహనం వెనుకనే అంబులెన్స్ ను ఏర్పాటు చేసి అందులో మానసిక వైద్యున్ని అందుబాటులో ఉంచమని వైద్య శాఖను కోరుతున్నానని అన్నారు.

బట్టలిప్పి కొట్టడానికి ఇది సినిమా కాదని చురకలాంటించారు. పవన్ రాజకీయాలలోకి వచ్చి కమెడియన్ అయ్యారని ఎద్దేవా చేశారు. పవన్ కళ్యాణ్ కంటే నటుడు బ్రహ్మానందం గొప్ప మేదస్సు ఉన్న వారని అన్నారు. బ్రహ్మానందం సినిమాలలోనే నటిస్తారని.. బయట నటించరని అన్నారు. బ్రహ్మానందానికి జీవితం విలువ తెలుసని.. ఆయన రామాయణ, వేదాల గురించి అనర్గళంగా మాట్లాడగలరని వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Latest news