జైల్లో గ్యాంగ్​వార్​.. 41 మంది మహిళా ఖైదీలు మృతి

-

సెంట్రల్​ అమెరికాలోని హోండురస్​లో దారుణం చోటుచేసుకుంది. దేశ రాజధాని తెగుసిగల్పాకు వాయవ్యంగా 30 మైళ్ల దూరంలో ఉన్న తమారా మహిళా జైల్లో మంగళవారం ఖైదీల మధ్య ఘర్షణలు జరిగాయి. ఈ  గొడవల్లో 41 మంది  మహిళా ఖైదీలు మరణించారు. వీరిలో కొందరు సజీవ దహనం కాగా.. మరికొందరు తుపాకీ బుల్లెట్ గాయాలతో మరణించారు. మరో ఏడుగురు మహిళా ఖైదీలు తుపాకీ కాల్పులు, కత్తి గాయాలతో తెగుసిగల్పా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

జైలులో రెండు గ్యాంగ్​ల మధ్య గొడవే ఈ మరణాలకు కారణమని ప్రాథమికంగా తెలుస్తోంది. జైళ్లలో అక్రమ కార్యకలాపాలను అరికట్టడానికి అధికారులు ఇటీవల చేసిన ప్రయత్నాల కారణంగానే అల్లర్లు జరిగాయని హోండురస్ జైళ్ల శాఖ అధికారి జూలిస్సా విల్లాన్యువా తెలిపారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.

ఈ ఘటనపై హోండురస్​ అధ్యక్షురాలు జియోమర క్యాస్ట్రో స్పందించారు. మహిళా ఖైదీల మరణాలు.. తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేశాయని ఆమె తెలిపారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని క్యాస్ట్రో పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news