పవన్ వ్యూహం మొదలు..ఓ రేంజ్ డైవర్షన్.!

-

ఇంతకాలం పవన్ ఏదో ఆవేశంగా మాట్లాడటం తప్ప..ఒక రాజకీయ వ్యూయ ప్రకారం ముందుకెళ్లారని అనుకునేవారు. సినిమాలు చేసుకోవడం..మధ్య మధ్యలో వచ్చి కాసేపు వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు చేసి వెళ్లిపోవడం..ఇంతే పవన్ చేసింది. కానీ వ్యూహం ప్రకారం..ప్రత్యర్ధులకు చెక్ పెట్టడం, జనసేనని బలోపేతం చేసే కార్యక్రమాలు చేసినట్లు కనిపించలేదు. కానీ ఇప్పుడు అందుకు భిన్నంగా పవన్ రాజకీయం చేస్తున్నారు. ఆయన ఒక స్ట్రాటజీ ప్రకారం ముందుకెళుతున్నారని తెలుస్తుంది.

పైకి చూసే వారికి ఆయన..యథావిధిగా వారాహి యాత్ర చేస్తూ వైసీపీని తిడుతున్నారని అంతా అనుకుంటున్నారు. కానీ ఇక్కడే అనేక అంశాలు ఉన్నాయి. ఆయన వ్యూహాత్మకంగా ముందుకెళుతూ..అటు వైసీపీతో పాటు ఇటు టి‌డి‌పిని సైతం ఇరుకున పెట్టే కార్యక్రమాలు చేస్తున్నారు. వైసీపీపై మాటల దాడి చేస్తున్న పవన్..ఎంత వీలైతే అంతగా వైసీపీని ప్రజల్లో నెగిటివ్ చేయడమే తన టార్గెట్. అదే సమయంలో జనసేన ఓట్లు పెంచుకోవడం మరొక వ్యూహం. ఇక పొత్తుల అంశంలో కూడా ఆయన రాజకీయం మారింది. మొన్నటివరకు పొత్తులు తప్పనిసరి అని చెప్పి..జ జగన్ ని గద్దె దించడానికి సి‌ఎం పదవి కూడా వదులుకుంటానని మాట్లాడారు.

కానీ ఇప్పుడు మాత్రం ప్రజలు అవకాశం ఇస్తే సి‌ఎం అవుతానని, జనసేన ప్రభుత్వం వస్తే ఏపీని నెంబర్ 1 గా చేస్తానని చెబుతున్నారు. పొత్తుల గురించి మాట్లాడటం లేదు. ఇలా పవన్ పొత్తుల గురించి మాట్లాడకపోవడం వెనుక పలు కారణాలు ఉన్నాయి. ముందే పొత్తుల గురించి మాట్లాడితే..వైసీపీకి ఓ అస్త్రం అందించినట్లు అవుతుంది. పవన్ జనసేనని చంద్రబాబుకు తాకట్టు పెడుతున్నారని వైసీపీ విమర్శలు చేస్తుంది. ఆ పరిస్తితి రాకుండా ఇప్పుడు తానే అంటున్నారు. అలాగే తన అభిమానులు సంతృప్తి చెందేలా చేస్తున్నారు.

కాకపోతే ఎన్నికల ముందు టి‌డి‌పితో పొత్తు తప్పనిసరి..కానీ అప్పటికి జనసేన బలం పెంచుకుని సి‌ఎం పదవి దక్కించుకునేలా చేసుకోవడమే పవన్ లక్ష్యమని తెలుస్తుంది. మొత్తానికి పవన్ పక్కా రాజకీయ నాయకుడుగా మారిపోయారు.

Read more RELATED
Recommended to you

Latest news