రాహుల్ గాంధీని ప్రధాని చేయడమే మా లక్ష్యం – రేవంత్ రెడ్డి

-

రాహుల్ గాంధీని ప్రధాని చేయడమే మా ప్రధాన లక్ష్యం అన్నారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీలోకి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని ఆహ్వానించేందుకు ఆయన ఇంటికి బయలుదేరారు రేవంత్ రెడ్డి, ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయలేదన్నారు. మహబూబ్ నగర్ కి నిధులు వస్తాయని అందరు ఆశించారని, పాలమూరు అభివృద్ధి కోసం చాలా మంది బిఆరెఎస్ లో చేరారని అన్నారు.

కానీ ఇక కెసిఆర్ హయంలో మహబూబ్ నగర్ అభివృద్ధి జరగదని.. కెసిఆర్ ని ఓడిస్తేనే అది సాధ్యమని జూపల్లి, గురునాధ్ రెడ్డి తిరుగుబాటు చేశారని అన్నారు. జూపల్లిని సాధారంగా కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించామన్నారు. మహబూబ్ నగర్ అభివృద్ధి జరగాలంటే కాంగ్రెస్ రావాలి అని వారిని కోరామన్నారు. చేరికలతో కెసిఆర్ వ్యతిరేక రాజకీయ పునారేకీకరణ ఉండబోతుందన్నారు.

ఇంకా చాలా మంది కెసిఆర్ వ్యతిరేక పునారేకికరణలో పాల్గొనబోతున్నారని తెలిపారు. కాంగ్రెస్ విజయానికి అందరు స్వాగతిస్తున్నారని అన్నారు. 2024 లో రాహుల్ గాంధీ ప్రధాని కావడానికి అందరం కలికట్టుగా పని చేయాలని చర్చించుకున్నామన్నారు. రాహుల్ గాంధీ రేపు సాయంత్రం అమెరికా నుండి వస్తున్నారని.. మంచి ముహూర్తంలో చేరికలు ఉంటాయని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news