అహ్మదాబాద్ ఎయిర్ పోర్ట్ లో భారీగా డ్రగ్స్ పట్టివేత

-

డ్రగ్స్ ముఠాలు రెచ్చిపోతున్నాయి. ఇప్పుడు విచ్చలవిడిగా డ్రగ్స్ ఎక్కడబడితే అక్కడ దొరుకుతున్నాయి. చివరికి శని నిర్మాతలు కూడా డ్రగ్స్ దందా మొదలుపెట్టి పట్టుబడ్డ వార్తలు ఈమధ్య వెలుగులోకి వచ్చాయి. తాజాగా అహ్మదాబాద్ ఎయిర్ పోర్ట్ లో భారీగా డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు అధికారులు. 32 కోట్ల విలువ చేసే 3.3 కేజీల బ్లాక్ కొకైన్ సీజ్ చేశారు డిఆర్ఐ అధికారులు. బ్రెజిల్ జాతీయుడి ట్రాలీ బ్యాగ్ కింది భాగంలో కొకైన్ దాచి తరలించే యత్నం చేశాడు కేటుగాడు.

కస్టమ్స్ అధికారుల స్కానింగ్ కు చిక్కకుండా సకల ప్రయత్నాలు చేశాడు కేటుగాడు. విశ్వసనీయ సమాచారం మేరకు అహ్మదాబాద్ ఎయిర్ పోర్ట్ లో మాటు వేసింది డిఆర్ఐ అధికారుల బృందం. బ్రెజిల్ నుండి వచ్చిన ప్రయాణీకుడిని అదుపులోకి తీసుకొని తమదైన స్టైల్ లో విచారణ చెయ్యగా అసలు విషయం బయటపడింది. దీంతో అతడిపై NDPS యాక్ట్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు అధికారులు.

Read more RELATED
Recommended to you

Latest news