ఇండియాలో ఇన్వెస్ట్ చేయండి.. కీలక కంపెనీల సీఈవోలతో మోదీ భేటీ

-

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ యూఎస్ పర్యటనలో ఇవాళ అక్కడి పారిశ్రామిక వేత్తలతో భేటీ అయ్యారు. ప్రముఖ చిప్‌ల తయారీ కంపెనీ మైక్రాన్‌ టెక్నాలజీ సీఈవో సంజయ్‌ మెహ్రోత్రా, జనరల్‌ ఎలక్ట్రిక్‌ సీఈవో లారెన్స్‌ కల్ప్‌, అప్లైడ్‌ మెటీరియల్స్‌ సీఈవో గారీ ఈ డికర్సన్‌తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయా సంస్థలు భారత్‌లో పెట్టుబడులు పెట్టాలని ఆయన ఆహ్వానించారు.

‘‘భారత్‌లో అపార అవకాశాలను చూస్తున్నాం. మెమొరీ, స్టోరేజ్‌ విభాగంలో మైక్రాన్‌ గ్లోబల్‌ లీడర్‌. డేటా సెంటర్ల నుంచి స్మార్ట్‌ఫోన్లు, పీసీల వరకు మొత్తానికి మెమొరీ పరికరాలను సరఫరా చేస్తామని ప్రధానితో భేటీ తర్వాత మైక్రాన్‌ సీఈవో సంజయ్‌ అన్నారు. ‘‘దేశంలో సెమీకండక్టర్ల తయారీని పెంచేందుకు మైక్రాన్‌ టెక్నాలజీస్‌ను ప్రధాని భారత్‌కు ఆహ్వానించారు’’ అని విదేశాంగశాఖ పేర్కొంది. భారత వైమానిక, పునరుత్పాదక ఇంధన రంగాల్లో జీఈ కీలక పాత్ర పోషించాలని ప్రధాని మోదీ కోరారు. భారత్‌ అద్భుతమైన అభివృద్ధి వైపు పయనించే సమయం ఆసన్నమైందని మోదీతో సమావేశం తర్వాత అప్లైడ్‌ మెటీరియల్స్‌ సీఈవో గారీ ఈ డికర్సన్‌ అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news