గతంలో కాపు రిజర్వేషన్ల కోసం ఉద్యమం చేసిన ముద్రగడ పద్మనాభం రాజకీయ ఎంట్రీ ఫిక్స్ అయింది. ఆయన త్వరలోనే వైసీపీలోకి వెళుతున్నారని తెలిసింది. తాజాగా ఆయన పవన్ కల్యాణ్‌కు రాసిన లేఖ బట్టి చూస్తే వైసీపీలోకి వెళ్ళి పిఠాపురంలో పోటీ చేస్తారని తేలింది. ఇటీవల పవన్..కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి టార్గెట్ గా విరుచుకుపడిన విషయం తెలిసిందే. గతంలో ద్వారంపూడి..పవన్‌ని బూతులు తిట్టడంతో..ఇప్పుడు పవన్ కౌంటర్ ఇచ్చారు.
అయితే ద్వారంపూడి వెంటనే పవన్‌కు కౌంటర్ ఇచ్చారు. అటు ముద్రగడ సైతం పవన్‌కు కౌంటర్ ఇస్తూ లేఖ రాశారు. దీంతో జనసేన శ్రేణులు ముద్రగడపై ఫైర్ అవుతున్నాయి. ఇక తన ఫ్యాన్స్ తో బూతులు తిట్టించడం మగతనం కాదని, సినిమాల్లోనే పవన్ హీరో అని, రాజకీయాల్లో కాదని ముద్రగడ..పవన్‌కు మరో లేఖ రాశారు. ఈ క్రమంలోనే దమ్ముంటే కాకినాడ సిటీలో ద్వారంపూడి పోటీ చేయాలని, లేదా తోక ముడిచి..పిఠాపురంలో పోటీ చేసి..తాను కూడా అక్కడే పోటీ చేసేలా సవాల్ చేయాలని ముద్రగడ అన్నారు.
జనసేన శ్రేణులు తిడుతుంటే ఇంకా తనకు రాజకీయాల్లోకి వచ్చి పోరాడాలనే ఉత్సాహం పెరిగిందని ముద్రగడ అన్నారు. అంటే ముద్రగడ వైసీపీలోకి రావడం, పిఠాపురం సీటులో పోటీ చేయడం ఖాయమని తెలుస్తుంది. ప్రస్తుతం అక్కడ వైసీపీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు ఉన్నారు. ఆయన పనితీరు ఏమి బాగోలేదు..జగన్, దొరబాబుకు సీటు ఇవ్వరని తెలిసింది.
దీంతో ముద్రగడని పోటీకి దింపితే కాపుల ఓట్లు కలిసొస్తాయని, గోదావరి జిల్లాల్లో వైసీపీకి కలిసొస్తుందని ప్లాన్ చేశారని తెలిసింది. ఇక ముద్రగడ పిఠాపురంలో పోటీ చేస్తే..పవన్ అక్కడ పోటీ చేస్తారో లేదో క్లారిటీ లేదు. కానీ ముద్రగడ పోటీ చేస్తే..గెలుస్తారా? అంటే టిడిపి, జనసేన విడిగా పోటీ చేస్తే గెలుస్తారు..కలిసి పోటీ చేస్తే మాత్రం కష్టమే.
గత ఎన్నికల్లో పిఠాపురంలో వైసీపీకి 83 వేల ఓట్లు రాగా, టిడిపికి 68 వేలు వచ్చాయి. జనసేనకు 28 వేలు వచ్చాయి. అంటే టిడిపి, జనసేన కలిస్తే 96 వేలు..వైసీపీ కంటే 13 వేలు ఎక్కువ. ఇది గత ఎన్నికల లెక్క..ఇప్పుడు టిడిపి, జనసేన ఇంకా బలపడ్డాయి. కాబట్టి పవన్ పోటీ చేయకపోయిన టిడిపి, జనసేన కలిస్తే పిఠాపురంలో ముద్రగడ గెలుపు డౌటే.