గత ఎన్నికల మాదిరిగా ఈ సారి బిఆర్‌ఎస్ పార్టీకి వన్ సైడ్ గా గెలిచే అవకాశాలు తక్కువగా ఉన్నాయి. ఈ సారి కాంగ్రెస్ పార్టీ నుంచి గట్టి పోటీ ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి. అదే సమయంలో బిఆర్‌ఎస్ లోని కొన్ని సిట్టింగ్ సీట్లని కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకునే అవకాశాలు ఉన్నాయని సర్వేల్లో తేలుతుంది. ఈ క్రమంలోనే ఉమ్మడి వరంగల్ జిల్లాలోని నర్సంపేట నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి లీడ్ ఉందని లేటెస్ట్ గా ఓ సర్వేలో తేలింది.
నర్సంపేట ఒకప్పుడు కమ్యూనిస్ట్ కంచుకోట..సిపిఐ పలుమార్లు గెలిచింది..మధ్య మధ్యలో కాంగ్రెస్ కూడా సత్తా చాటింది. ఇక 1994, 1999లో ఇక్కడ టిడిపి హవా నడిచింది. 2004లో అనూహ్యంగా కాంగ్రెస్, కమ్యూనిస్టుల పొత్తులో ఇక్కడ బిఆర్‌ఎస్ గెలిచింది. 2009లో బిఆర్‌ఎస్, కమ్యూనిస్టుల పొత్తుతో టిడిపి గెలిచింది. 2014లో కాంగ్రెస్ సీటు ఆశించిన దొంతి మాధవరెడ్డికి సీటు దక్కలేదు. దీంతో ఆయన ఇండిపెండెంట్ గా పోటీ చేసి గెలిచి..ఆ తర్వాత కాంగ్రెస్ లోకి వెళ్లారు.
ఇక 2018 ఎన్నికల్లో మాధవరెడ్డి కాంగ్రెస్ నుంచి బరిలో దిగగా, బిఆర్‌ఎస్ నుంచి పెద్ది సుదర్శన్ రెడ్డి పోటీ చేశారు. ఇక 16 వేల ఓట్ల మెజారిటీతో సుదర్శన్ గెలిచారు. ఎమ్మెల్యేగా సుదర్శన్ అనుకున్న మేర సక్సెస్ అయినట్లు కనిపించలేదు. పైగా ఈయనపై అనేక ఆరోపణలు వచ్చాయి. ఇదే క్రమంలో కాంగ్రెస్ లో దొంతి ప్రజల్లో ఉంటూ..తన బలాన్ని పెంచుకున్నారు. దీంతో ఇక్కడ అనూహ్యంగా కాంగ్రెస్ పార్టీకి లీడ్ వచ్చిందని ఓ సర్వే స్పష్టం చేసింది.
అయితే ఇక్కడ బిజేపికి పెద్ద బలంలేదు. ఒకవేళ టిడిపి నుంచి బిజేపిలోకి వెళ్ళిన రేవూరి ప్రకాష్ రెడ్డి..ఇక్కడ పోటీ చేస్తే..కాస్త ఓట్ల చీలిక జరుగుతుంది. అప్పుడు ఫలితం ఎలా వస్తుందో ఊహించలేము..ప్రస్తుతానికి మాత్రం ఇక్కడ కాంగ్రెస్‌కు లీడ్ ఉందని అంటున్నారు.