వెస్ట్ ఇండీస్ పై జింబాబ్వే సంచలన విజయం…

-

ఈ సంవత్సరం ఇండియా వేదికగా జరగనున్న వన్ డే వరల్డ్ కప్ కోసం క్వాలిఫైయర్ మ్యాచ్ లు జింబాబ్వే వేదికగా జరుగుతున్నాయి. అందులో భాగంగా ఈ రోజు జింబాబ్వే మరియు వెస్ట్ ఇండీస్ జట్ల మధ్యన జరిగిన మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన జింబాబ్వే 49 .5 ఓవర్ లలో 268 పరుగులు చేసి ఆల్ అవుట్ అయింది. బదులుగా 269 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన వెస్ట్ ఇండీస్ అనూహ్యంగా కేవలం 233 పరుగుల వద్దనే ఆల్ అవుట్ అయ్యి 35 పరుగుల తేడాతో ఓటమి పాలయింది. ఖచ్చితంగా గెలుస్తుంది అనుకున్న వెస్ట్ ఇండీస్ జింబాబ్వే బౌలర్ల ధాటికి కుదేలై పరువు పోయే ఓటమిని కొని తెచ్చుకుంది.

గత మ్యాచ్ లో రాణించిన హోప్ మరియు పూరం లు కూడా కీలక సమయంలో అవుట్ అవడంతో ఓటమై తప్పలేదు. జింబాబ్వే బౌలర్లలో చాటారా 3, ముజరాబానీ 2, ఎంగరవా 2 వికెట్లు తీసుకున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news