కోనసీమ జిల్లా పి.గన్నవరంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆ పార్టీ నేతలతో సమీక్ష చేపట్టారు. పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు. గెలిచిన తర్వాత కమిట్మెంట్తో పార్టీలోనే ఉండాలని సూచించారు. పి. గన్నవరంను వ్యక్తిగతంగా పర్యవేక్షిస్తానని చెప్పారు. మరోవైపు కాకినాడలో దళితుడిని హత్య చేస్తే ప్రభుత్వ చట్టాలు ఏమయ్యాయని ప్రశ్నించారు. ఎమ్మెల్యే అయినా ఎమ్మెల్సీ అయినా శిక్షపడాల్సిందేనని స్పష్టం చేశారు.
ఇదిలా ఉంటే.. కోనసీమ జిల్లాలో భారీ వర్షం పడింది. దీంతో పవన్ మలికిపురం బహిరంగ సభ వాయిదా చేశారు. సభ కోసం అన్ని ఏర్పాట్లు చేసినప్పటికీ… వాతావరణ పరిస్థితుల దృష్ట్యా సభ వాయిదా వేసినట్లు జనసేన నేతలు తెలిపారు. రేపు వాతావరణ పరిస్థితులను పరిశీలించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.