తెలంగాణ రైతులకు శుభవార్త చెప్పింది కేసీఆర్ సర్కార్. రేపటి నుంచే రైతు బంధు నిధులు విడుదల కానున్నాయి. సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న అద్భుత పథకం రైతుబంధు డబ్బులు ఈనెల 26వ తేదీ నుంచి నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ కానున్నాయి.
raithu bandu
రైతుల ఆత్మహత్యలతో పాటు దిగుబడులను పెంచే ఉద్దేశంతో రూపొందించిన ఈ రైతుబంధు పథకం ఇప్పటికే ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. సాగునీరు, ఉచిత విద్యుత్, పెట్టుబడి సాయం కూడా ప్రభుత్వమే సమకూర్చుతుండటంతో అన్నదాతలు అద్భుతాలు సృష్టిస్తున్నారు. 2018 సంవత్సరంలో ఊపిరి పోసుకున్న ఈ పథకం ద్వారా ఇప్పటివరకు 10 విడతల్లో డబ్బులు జమయ్యాయి. ఈ ఏడాది వరంగల్ జిల్లాలో అదనంగా మరో 11,860 మంది, హనుమకొండ జిల్లాలో 1,111 మంది రైతులు లబ్ధి పొందనున్నారు.