ప్రభాస్‌ ప్రాజెక్ట్‌-కె పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన కమల్‌

-

డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తోన్న సినిమా ప్రాజెక్ట్ కె. వైజయంతి మూవీస్ బ్యానర్ పై దాదాపు రూ.500 కోట్ల బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొనే, దిశా పటానీ కీలకపాత్రలలో నటిస్తున్నారు. సైన్స్ ఫిక్షన్ డ్రామాగా రాబోతున్న ఈమూవీలో తాజాగా లోకనాయకుడు కమల్ హాసన్ జాయిన్ అయ్యారు.

Kamal Haasan to shoot for Prabhas' Project K in August: Report | Hindi  Movie News - Times of India

ప్రాజెక్ట్-కెలో తాను నటిస్తుండడంపై కమల్ కూడా స్పందించారు. “50 ఏళ్ల కిందట నేను డ్యాన్స్ అసిస్టెంట్ గా, అసిస్టెంట్ డైరెక్టర్ గా చిత్ర రంగంలో ప్రస్థానం ప్రారంభించాను. ఆ సమయంలో నిర్మాతగా అశ్వినీదత్ పేరు బలంగా వినిపించేది. ఇప్పుడు 50 ఏళ్ల తర్వాత ఇద్దరం కలిశాం. ప్రాజెక్ట్-కె చిత్రం కోసం నేనెంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. ప్రేక్షకులు తమ హృదయాల్లో నాకు ఎలాంటి స్థానం ఇచ్చినప్పటికీ, నాణ్యమైన నటన కనబర్చడమే నా తొలి ప్రాధాన్యత. చెప్పాలంటే నేను సినిమా పిచ్చోడ్ని. అందుకే సినిమా రంగంలో ఏ కొత్త ప్రయత్నం నా దృష్టికి వచ్చినా అభినందిస్తుంటాను. ఇప్పుడు ప్రాజెక్ట్-కె చిత్రాన్ని కూడా మొదటగా నేనే అభినందించాలనుకుంటున్నా. నాగ్ అశ్విన్ తనదైన ఆలోచన విధానంతో ప్రాజెక్ట్-కె చిత్రాన్ని తెరకెక్కిస్తున్న తీరు దేశవ్యాప్తంగానూ, ప్రపంచ సినిమా రంగంలోనూ మార్మోగుతుందని కచ్చితంగా చెప్పగలను” అని కమల్ హాసన్ వివరించారు.

 

 

Read more RELATED
Recommended to you

Latest news