హీరో విజయ్ పై కేసు నమోదు…

-

తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం చూస్తే తమిళ స్టార్ హీరో విజయ్ పై కేసు నమోదు అయింది. పూర్తి వివరాల్లోకి వెళితే విజయ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ లియో నుండి ఇటీవల మొదటి సాంగ్ “నా రెడీ…” రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ఈ సాంగ్ వీడియోలో మత్తు మందును విరివిగా ఉపయోగిస్తున్న దృశ్యాలను చూపించడంతో ఒక సామజిక కార్యకర్త ఆన్లైన్ ద్వారా కంప్లైంట్ చేశారట. ఈ కంప్లైంట్ ను ఆధారంగా తీసుకున్న పోలీసులు చిత్ర బృందం మరియు హీరో విజయ్ పైన కేసును నమోదు చేశారట. ఈ సినిమాను అక్టోబర్ లో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారట.

కాగా ఈ సినిమాను ప్రముఖ స్టార్ డైరెక్టర్ లోకేష్ కానగరాజన్ తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. మరి ఈ కేసు గురించి మిగిలిన వివరాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news