పవన్‌ కళ్యాణ్‌ లా మనం భార్యలను మార్చలేం : సీఎం జగన్

-

జనసేనాని పవన్ కళ్యాణ్ పై సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జగనన్న అమ్మఒడి పథకం ప్రారంభోత్సవం సభ సందర్భంగా జనసేనాని పవన్ కళ్యాణ్ పై సీఎం జగన్ సెటైర్లు వేశారు. ‘ఆయనలా మనం రౌడీల్ల తొడలు కొట్టలేం…బూతులు తిట్టలేం… వారిలా నలుగురిని పెళ్లి చేసుకొని, నాలుగేళ్లకోసారి భార్యను మార్చలేము.. పెళ్లి అనే పవిత్ర వ్యవస్థను రోడ్డుమీదికి తీసుకురాలేం… వారిలా ఈ పనులు మనం చేయలేం. ఇవన్నీ కూడా వారికే సాధ్యం’ అని జగన్ వాక్యానించారు.

నాలుగో విడత అమ్మ ఒడి కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఎం వైఎస్‌ జగన్‌..అనంతరం మాట్లాడారు. పది రోజుల పాటు పండుగలా జగనన్న అమ్మ ఒడి నిర్వహించాలని పిలుపునిచ్చారు. 42 లక్షల మందికి పైగా తల్లుల ఖాతాల్లో రూ.6,392 కోట్లు విడుదల చేసినట్లు చెప్పారు సీఎం వైఎస్‌ జగన్‌.రూ.26 వేల కోట్లు ఇప్పటి వరకు ఈ పథకానికి ఇవ్వడం జరిగింది.. ఇదంతా మధ్యవర్తుల ప్రమేయం లేకుండానే లబ్ధిదారులకు నేరుగా అందిందన్నారు.. పిల్లల భవిష్యత్తు కోసం.. బడికి పిల్లలను పంపించేందుకు ఆ తల్లులకు ఇచ్చే ప్రోత్సాహకం ఇదని వివరించారు.

Read more RELATED
Recommended to you

Latest news