వరల్డ్ కప్ క్వాలిఫైయర్స్ 2023: సూపర్ సిక్స్ లో జింబాబ్వే తో ఒమన్ ఢీ

-

ఈ సంవత్సరం అక్టోబర్ లో జరగనున్న వన్ డే వరల్డ్ కప్ ఇండియాలో జరగనున్న విషయం తెలిసిందే. కాగా ఈ వరల్డ్ కప్ కు అగ్ర జట్లు డైరెక్ట్ గా మెయిన్ మ్యాచ్ లు ఆడనున్నాయి. కానీ కొన్ని జట్లు మాత్రమే క్వాలిఫైయర్స్ ఆడుతున్నాయి. అందులో భాగంగా ఈ రోజు సూపర్ సిక్స్ దశలో జింబాబ్వే మరియు ఒమన్ జట్లు తలపడుతున్నాయి. ఈ రెండు జట్లు కూడా గ్రూప్ దశలో మంచి ప్రదర్శన చేసి సూపర్ సిక్సుకు అర్హత సాధించాయి. గ్రూప్ స్టేజ్ లో జింబాబ్వే మొదటి స్థానంలో నిలువగా, ఒమన్ మరో గ్రూప్ నుండి కేవలం రెండు మ్యాచ్ లలో మాత్రమే గెలిచి సూపర్ సిక్సుకు వెళ్ళింది. ఇప్పుడు సూపర్ సిక్స్ దశలో మంచి ప్రదర్శన చేస్తేనే తర్వాత దశకు అర్హత సాధిస్తుంది..

కాగా ఈ మ్యాచ్ లో మొదట టాస్ గెలిచిన ఒమన్ జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. మరి బ్యాటింగ్ చేస్తున్న జింబాబ్వే ఒమన్ ముందు ఎంత టార్గెట్ ను ఉంచుతుంది అన్నది చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news