తిరుపతిలో కాసేపటి క్రితమే పౌరసరఫరాల శాఖా మంత్రి కారుమూరి నాగేశ్వరరావు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కారుమూరి మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ యాత్ర మధ్యలో కుంతీ సాకులు చెప్పి తన సినిమాలకు డబ్బింగ్ చెప్పుకోవడానికి వెళ్ళాడు, అలాంటి వారికి రాజకీయాలు అవసరమా అంటూ విమర్శించారు. పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వచ్చాడు… కానీ అందరిలాగా సొంతంగా తనకాళ్ళపైన నిలబడి తన కష్టాన్ని మాత్రమే నమ్ముకుని ఎదగాలి అనుకోవడం లేదు. చంద్రబాబు సంక ఎక్కి రాజకీయంగా నిలదొక్కుకోవాలి అన్న ప్రణాళికలో ఉన్నాడు. అలాంటి వారు మాపై విమర్శలు చేయడం ఏమిటి అంటూ ప్రశ్నించారు.
పవన్ కళ్యాణ్ ఎజెండా మైక్ పట్టుకుని తాటతీస్తా… బట్టలు ఊడదీసి కొడతా… తోలు తీస్తా అన్న మాటలను తప్ప ఇంకేమీ రాదని కారుమూరి నాగేశ్వరరావు పవన్ ను ఉద్దేశించి విమర్శలు చేశాడు.