మహిళల కోసం కేంద్రం సరికొత్త స్కీమ్.. ఇప్పటికే రూ.6 వేల కోట్లు..!

-

కేంద్ర ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలను తీసుకు వస్తూ ఉంటుంది. చిన్న పొదుపు పథకాలకు ఆదరణ ఎక్కువ. వీటిల్లో ఎక్కువగా పోస్టాఫీస్ స్కీమ్స్ ఏ వున్నాయి. ఈసారి బడ్జెట్‌లో మహిళల కోసమే ప్రత్యేకంగా ఒక చిన్న పొదుపు పథకం ని తీసుకొచ్చింది. అదే మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికేట్. ఈ స్కీమ్ ద్వారా చక్కటి ప్రయోజనాలు ని ఇస్తుంది. డిపాజిటర్ల నుంచి మంచి ఆదరణ కూడా వస్తోంది. ఈ సంవత్సరం ఏప్రిల్ 1నే అందుబాటు లోకి తీసుకు వచ్చారు.

ఇప్పటివరకు 10.2 లక్షల ఖాతాలు ఓపెన్ చేసారు. దీని కింద మొత్తంగా రూ.6 వేల కోట్లకు పైగా డిపాజిట్ అయ్యాయి. ఈ పథకాన్ని రెండేళ్ల కాలవ్యవధితో కేంద్రం తీసుకొచ్చింది. మహిళలు లేదా బాలికల పేరు మీద మాత్రమే అకౌంట్ ఓపెన్ చెయ్యవచ్చు. 2023 ఏప్రిల్ నుంచి 2025 మార్చి వరకు ప్రస్తుతం రెండేళ్ల పాటు అందుబాటులో ఉంటుంది.

ఫిక్స్‌డ్ ఇంట్రెస్ట్ రేటు 7.5 శాతంగా వుంది. డిపాజిట్‌పై గరిష్టంగా రూ.2 లక్షల వరకు డిపాజిట్ చేయొచ్చు.ఈ స్కీం కింద ప్రస్తుతం 8.2 శాతం వడ్డీ రేటు వస్తోంది. గరిష్ట డిపాజిట్ లిమిట్‌ను రూ.15 లక్షల నుంచి 30 లక్షలకు పెంచారు. సింగిల్ అకౌంట్ డిపాజిట్ పరిమితిని రూ.4.5 లక్షల నుంచి రూ.9 లక్షలకు పెంచారు. జాయింట్ అకౌంట్ ని అయితే రూ.15 లక్షలకు పెంచింది.

Read more RELATED
Recommended to you

Latest news