అసెంబ్లీలో అడుగుపెట్టనీయకుండా దమ్ముంటే నన్ను ఆపండని నారా లోకేష్ కు అనిల్ కుమార్ యాదవ్ మరో సవాల్ విసిరారు. యువ గళం కు వస్తున్న స్పందనను చూసి జగన్ జడుసుకుంటున్నాడని లోకేష్ మాట్లాడడం విచిత్రంగా ఉందని విమర్శలు చేశారు. వచ్చే ఎన్నికల్లో నన్ను అసెంబ్లీలో అడుగుపెట్టనీయకుండా ఆపే దమ్ముంటే వచ్చి పోటీ చేయాలని సవాల్ విసిరారు.
ఎన్నికల్లో నా పై పోటీ చేసి గెలవాలని లోకేష్ కు సవాల్ విసిరాను..లేక నీ తరపున ఎవరినైనా పెట్టి గెలవాలని కూడా చెప్పానని గుర్తు చేశారు. రాకపోయినా ఓడిపోయినట్లే నని భావిస్తానని చురకలు అంటించారు. టికెట్ రాదంటున్నారు కదా అయితే ఎందుకు సవాల్ స్వీకరించడం లేదని ఫైర్ అయ్యారు. దమ్ముంటే సవాల్ స్వీకరించాలి… అంతేగానీ డొంక తిరుగుడు వద్దన్నారు. నారా లోకేష్ కు మాట్లాడేందుకు చేత కావడం లేదని.. ఆయన ప్రసంగాన్ని చూసి టిడిపి నేతలే నవ్వుకుంటున్నారని ఎద్దేవా చేశారు అనిల్ కుమార్ యాదవ్.