ఈ 6 అలవాట్లు అస్సలు ఆరోగ్యానికి మంచివి కావు..!

-

ఆరోగ్యంగా ఉంటేనే ఆనందంగా జీవించగలం. ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యంగా ఉండాలని అనుకుంటారు. కానీ వివిధ రకాల సమస్యలు తలెత్తుతూ ఉంటాయి. ఏది ఏమైనప్పటికీ ఆరోగ్యం పట్ల తప్పకుండా ప్రతి ఒక్కరు శ్రద్ధ వహించాలి. ఈ అలవాట్లు ఏమీ లేకుండా చూసుకోవడం చాలా ముఖ్యం. ఈ అలవాట్లు ఉంటే మీ ఆరోగ్యానికి హాని కలుగుతుంది మీ ఆరోగ్యం పాడవుతుంది. మరి ఎటువంటి అలవాట్లు ఉండాలి.. ఎటువంటి ఏ తప్పులు చేయకూడదు అనేది ఇప్పుడు చూద్దాం.

తిన్న తర్వాత బ్రష్ చేయడం చాలా ముఖ్యం. అయితే ఎసిడిక్ పదార్థాలు తిన్న తర్వాత అరగంట పాటు బ్రష్ చేయకూడదు. ద్రాక్ష పండ్లు, నిమ్మ ఇలా ఎసిడిక్ పదార్థాలను తిన్న వెంటనే బ్రష్ చేస్తే పంటి ఎనామిల్ బలహీనమవుతుంది. అలానే చాలామంది వారమంతా పనిచేసి వీకెండ్ మాత్రం ఫుల్లుగా నిద్రపోతూ ఉంటారు అది కూడా అస్సలు మంచిది కాదు. వీకెండ్ లో అతిగా నిద్ర పోవడం వలన కొన్ని రకాల వ్యాధులు కచ్చితంగా వస్తాయి.

రోజు ఏడు నుండి ఎనిమిది గంటల పాటు ప్రశాంతంగా నిద్ర పోవడం ముఖ్యం. అలానే చాలామంది అల్పాహారాన్ని, భోజనాన్ని స్కిప్ చేస్తూ ఉంటారు. అలా చేయడం కూడా మంచిది కాదు. వ్యాయామం తర్వాత ప్రోటీన్ షేక్ తాగితే కండరాల పెరుగుదలని అది ప్రోత్సహిస్తుంది నొప్పిని తగ్గిస్తుంది కానీ రాత్రిపూట వ్యాయామం చేసాక ప్రోటీన్ షేక్ తీసుకుంటే ఆరోగ్యం పాడవుతుంది మీ కడుపు హెవీగా ఉంటుంది జీర్ణం అవ్వడం చాలా కష్టం అవుతుంది. ఎక్కువసేపు చాలామంది జిమ్ కి వెళ్లి వ్యాయామం చేస్తూ ఉంటారు కానీ అలా వ్యాయామం ఎక్కువ సేపు చేస్తే నిద్రకి భంగం కలిగి ఆరోగ్యం పాడవ్వచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news