షాకింగ్ : అరగంటలో అమెరికా వెళ్లొచ్చు

-

ప్రస్తుతం భూమి మీద ఉన్న వేగవంతమైన రవాణా సాధనం విమానమే. ఒక దేశంలోని ఓ ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి గంటల్లో చేరుకోగలుగుతున్నాం. వందల కిలోమీటర్లైనా గంటల్లో వెళ్తున్నాం. కానీ ఒక ఖండం నుంచి మరో ఖండం.. దూర ప్రాంతాలకు వెళ్లాలంటే మాత్రం సుదీర్ఘ సమయం తప్పదు. ఉదాహరణకు సిడ్నీ నుంచి లండన్ వెళ్లాలంటే.. కనీసం 19 గంటలు ఆగకుండా ప్రయాణించాలి.

మరి అలాంటిది ఇండియా నుంచి అమెరికాకి అరగంటలో వెల్లగలిగితే..ఎంత బావుంటుంది. అయితే ఇది ఊహ మాత్రమే కాదు.. ఇది వాస్తవం కూడా కాబోతోంది. కాకపోతే ఇప్పుడే కాదు.. 2069లో అన్నమాట. అంటే.. మరో 50 ఏళ్ల తర్వాత అన్నమాట. అప్పటికి రవాణాకి సంబంధించి విప్లవాత్మకమైన మార్పులు వచ్చేస్తాయట. భూమిపైన ఓ ఖండం నుంచి మరో ఖండానికి నిమిషాల్లో చేరుకుంటారట. ధ్వని కంటే ఐదురెట్లు ఎక్కువ వేగంతో ప్రయాణించే విమానాలే ప్రధాన రవాణా సాధనాలవుతాయట.

గంటకి 95 వేల మైళ్ల వేగంతో ప్రయాణించే ‘రీ-యూజబుల్‌’ రాకెట్‌ లు వచ్చేస్తాయట. వీటితో భారత్‌ నుంచి అమెరికాకి అరగంటలో చేరుకోవచ్చట. రైళ్లకు బదులుగా సూపర్‌సోనిక్‌ ట్యూబ్‌ ట్రాన్స్‌పోర్ట్‌ సిస్టమ్స్‌ వచ్చేస్తాయట. సముద్ర, భూగర్భాల్లో ప్రయాణిస్తారట. రోడ్లపైన కార్లకి బదులు క్వాడ్‌పాడ్‌లు వస్తాయట. అంటే ఇవి భూమి, నీరు, ఆకాశం ఎక్కడైనా ప్రయాణిస్తాయన్నమాట.

అంతే కాదు.. యాభై ఏళ్ల తర్వాత మనుషులు డ్రైవ్‌ చేయడం నేరం అవుతుందట. ఎందుకంటే అప్పుడు ఎలాంటి వాహనాలేవైనా సరే వాటికవే నడుస్తాయి. అలాంటి టెక్నాలజీ వస్తుంది. ఇవన్నీ ఎవరి ఊహలో కాదు.. లండన్‌లో శాంసంగ్‌ సంస్థ ఏర్పాటు చేసిన టెక్నాలజీ పార్కు పార్కులో నిపుణులు అంచనా వేసి రూపొందించిన రిపోర్టులు.

Read more RELATED
Recommended to you

Latest news